సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Adipurush: కృతి సనన్ మదర్ కూడా ఈ ఆదిపురుష్ గురించి...

ABN, First Publish Date - 2023-06-22T13:01:11+05:30

చాలామంది చాలా రకాలుగా ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన 'ఆదిపురుష్' సినిమా గురించి మాట్లాడేరు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురించి కృతి సనన్ మదర్ గీత ఏమి మాట్లాడారో చూడండి.

Adipurush
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పుడు దేశం అంతా సినిమా ప్రేక్షకులు ఒక్క సినిమా గురించే మాట్లాడుతున్నారు, అదే 'ఆదిపురుష్' #Adipurush గురించి. అయితే ఆ సినిమా గురించి బాగుంది అని కాదు, దర్శకుడు ఓం రౌత్ (OmRaut) ని, మాటల రచయిత మనోజ్ ముంతషీర్ (ManojMuntashir) ని విమర్శిస్తూ రామాయణాన్ని #Ramayanam ఇంత దారుణంగా ఎలా చూపిస్తారు అని తిడుతున్నారు కూడా. అలాగే ఈ సినిమాకి ఇలా బాడ్ టాక్ రావటంతో సోమవారం నుండి ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగా పడిపోయాయి. ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (KritiSanon) ఇందులో రాముడు, సీత గా నటించారు.

ఇదిలా ఉంటే కృతి సనన్ తల్లి గీత సనన్ (GeetaSanon) ఈ 'ఆదిపురుష్' #AdipurushControversy గురించి తన సాంఘికామాద్యమంలో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో గీత సనన్, ఈ సినిమాని శబరి ఎంగిలి పళ్ళు పెట్టింది అని కాకుండా, ఆమె ప్రేమను మాత్రమే చూడండి అని చెప్పింది. అలాగే ఈ సినిమాని మంచి మనసుతో చూస్తే అందంగా కనపడుతుంది. ఈ సినిమాలో భావోద్వేగాలను అర్ధం చేసుకుంటే అంతా బాగుంటుంది, అది కాకుండా ఎదుటి మనిషి తప్పులను మాత్రమే చూడొద్దు అని చెప్పింది. చివర్లో జై శ్రీరామ్ అంటూ పోస్ట్ ముగించింది.

అయితే ఈమె పెట్టిన పోస్ట్ కి కూడా నెటిజన్స్ తీవ్రంగా స్పందిస్తూ, మీరు ఎలా సపోర్ట్ చేస్తారు ఈ సినిమాని అంటూ ఆమె మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు గీత సనన్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఒక తప్పు జరిగిపోయింది, అందుకని ఆ తప్పుని వదిలెయ్యాలి. అంతే కానీ మీ అమ్మాయి సినిమాలో ఉందని, మీరు ఈ సినిమాని సమర్ధించటం ఏమీ బాగోలేదు అని నెటిజన్స్ ఆమె పోస్ట్ కి కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - 2023-06-22T13:11:44+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!