KL Rahul- Athiya Shetty: పెళ్లికి అన్నీ సిద్ధం
ABN, First Publish Date - 2023-01-23T10:39:20+05:30
బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో లవ్‌బర్డ్స్ కేఎల్ రాహుల్ (KL Rahul), అతియా శెట్టి (Athiya Shetty) జంట ఒకటి.
బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో లవ్‌బర్డ్స్ కేఎల్ రాహుల్ (KL Rahul), అతియా శెట్టి (Athiya Shetty) జంట ఒకటి. ఈ జంట దాదాపు నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే ఇటీవలే ఈ వీరి పెళ్లీ గురించి వరుస వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై అప్పుడప్పుడు అతియా శెట్టి తండ్రి, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి మాత్రమే స్పందించేవాడు. కానీ పెళ్లి గురించి డేట్ మాత్రం చెప్పలేదు. అయితే అతియా శెట్టి, కేఎల్ రాహుల్‌ను సోమవారం వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఈ సెలబ్రిటీ జంట ఖండాలాలోని(Khandala farmhouse) సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో పెళ్లి చేసుకోనున్నారు. ఈ వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనుంది. అనంతరం యంత్రం 6:30 గంటలకు ఫొటోలకు పోజులివ్వనున్నారు. జనవరి 21వతేదీన ఈ జంట ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. 22వతేదీన మెహందీ, హల్దీ వేడుకలు జరిగాయి. పెళ్లి తర్వాత అతియా, కేఎల్ రాహుల్ జంట ముంబయి, బెంగళూరు నగరాల్లో తమ స్నేహితుల కోసం గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. కాగా 2015లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అతియా శెట్టి చివరిగా 2019 చిత్రం ‘మోతీచూర్ చక్నాచూర్’ సినిమాలో నటించింది.