కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kiara Adwani : డిన్నర్‌ డేట్‌ తర్వాత అలా జరిగిపోయింది!

ABN, First Publish Date - 2023-12-07T17:35:09+05:30

కియారా అడ్వాణీ (Kiara adwani), సిద్ధార్థ్‌ మల్హోత్ర (Sidarth Malhotra) ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. సిద్ధార్ధ్‌ మల్హోత్ర తనను ప్రపోజ్‌ చేసిన క్షణాలను ఆమె గుర్తు చేసుకుంది. ఆ క్షణాలను ఎప్పటికీ మరచిపోలేనంటూ భావోద్వేగానికి గురైంది.

కియారా అడ్వాణీ (Kiara adwani), సిద్ధార్థ్‌ మల్హోత్ర (Sidarth Malhotra) ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. సిద్ధార్ధ్‌ మల్హోత్ర తనను ప్రపోజ్‌ చేసిన క్షణాలను ఆమె గుర్తు చేసుకుంది. ఆ క్షణాలను ఎప్పటికీ మరచిపోలేనంటూ భావోద్వేగానికి గురైంది. ‘షేర్షా’లోని డైలాగ్‌ చెప్పి ప్రేమను తెలియజేశాడంటూ ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో ఆమె చెప్పారు. కియారా మాట్లాడుతూ ‘‘షేర్షా’ సినిమా తర్వాత మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. కొద్ది రోజుల తర్వాత సిద్థార్థ్‌, అతని కుటుంబ సభ్యులతో కలిసి రోమ్‌ టూర్‌కు వెళ్లా. తను నాకు ప్రపోజ్‌ అప్పుడే నాకు అర్థమైంది. ‘‘నువ్వు నాకు ప్రపోజ్‌ చేయాలనుకుంటే ముందు నా తల్లిదండ్రుల పర్మిషన్‌ తీసుకోవాలి’’ అని చెప్పా.

తర్వాత నేనూ - సిద్థార్థ్‌, వాళ్ల రిలేటివ్‌ ఒకరు డిన్నర్‌ డేట్‌కు వెళ్లాం. క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ తర్వాత నాకు బాగా కాస్త ఇబ్బందిగా అనిపించింది. వాకింగ్‌కు వెళ్దామని సిద్థార్థ్‌ అనడంతో నేను కూడా ఓకే అన్నా. మేమిద్దరం కాస్త దూరం వెళ్లగానే చుట్టుపక్కల ఉన్న పొదల్లోంచి ఒక్క వ్యక్తి వయోలిన్‌తో మా వద్దకు వచ్చి ప్లే చేస్తూ ఉన్నాడు. వెంటనే, సిద్థార్థ్‌ మోకాళ్లపై కూర్చొని ‘షేర్షా’లోని.. ‘‘ఢిల్లీ కా సీదా సాదా లుండా హు’’ అంటూ డైలాగ్‌ చెప్పి తన ప్రేమను తెలియజేశాడు. అతను డైలాగ్‌ చెబుతుంటే నాకు నవ్వు ఆగలేదు. అతని ప్రేమకు అంగీకారం తెలిపాను. మా జీవితాల్లో ఎంతో విలువైన ఆ క్షణాలను సిద్ధార్థ్‌ బంధువు వీడియో తీశాడు’’ అంటూ కియారా ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జైసల్మేర్‌లో వీరిద్దరి పెళ్లి జరిగింది.

Updated Date - 2023-12-07T17:35:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!