Kiara Adwani: అందుకే ప్రెగ్నెంట్ కావాలనుకుంటోందట!
ABN, First Publish Date - 2023-07-30T11:20:31+05:30
గర్బవతి కావాలనుందని గతంలో కియారా అడ్వాణీ (Kiara adwani) చెప్పిన మాటలు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే 2019లో వచ్చిన ‘గుడ్‌న్యూస్’ (good news) చిత్రం విడుదల సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రెగ్నెంట్ అవ్వాలనే తన కోరికను బయట పెట్టింది కియారా!
గర్బవతి కావాలనుందని గతంలో కియారా అడ్వాణీ (Kiara adwani) చెప్పిన మాటలు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే 2019లో వచ్చిన ‘గుడ్‌న్యూస్’ (good news) చిత్రం విడుదల సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రెగ్నెంట్ అవ్వాలనే తన కోరికను బయట పెట్టింది కియారా! ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రాను9Sidharth malhotra) పెళ్లాడింది. ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లో వీరి వివాహం జరిగింది. రెండు నెలల క్రితం ఆమె ఓ ప్రైవేట్ కార్య్రకమంలో పాల్గొంది. వేసుకున్న డ్రెస్‌ను బట్టి ఆమె పొట్ట కాస్త పెద్దగా కనిపించడంతో ‘కియారా ప్రెగ్నెంటా’ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మధ్యకాలంలో గమనిస్తే నాజూకుగానే కనిపించడంతో అలాంటిదేమీ లేదని నెటిజన్లే తేల్చేశారు.
‘‘గర్భం దాల్చిన సమయంలో నచ్చింది తినొచ్చు, అడ్డు చెప్పేవారు ఉండరు. పుట్టే బిడ్డ ఆడ, మగ ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉంటే అంతే చాలు’ అని అప్పట్లో చెప్పుకొచ్చింది. తాజాగా బాలీవుడ్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారాయి. ఇప్పుడు కియారాకు పెళ్లయింది కాబట్టి సైన్ చేసిన సినిమాలన్నీ పూర్తి చేసి త్వరలోనే గుడ్‌న్యూస్ చెబుతుందేమో చూడాలి’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం సిద్దార్థ్‌ను ట్రోల్ చేస్తున్నారు. ‘సిద్ధార్థ్ వింటున్నావా? కియాలో ఏమంటుందో.. అందుకే ప్రెగ్నెంట్ కావాలనుకుంటోందట’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
‘వినయ విధేయ రామ’, ‘భరత్ అనే నేను’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భామ కియారా అడ్వాణీ, బాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేస్తున్న ఆమె తెలుగులో రామ్‌చరణ్ సరసన ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తోంది. హృతిక్ రోషన్ సరసన ‘వార్ 2’లో నటిస్తోంది.