#SidKiara: ఆ రాత్రి చాలా ప్రత్యేకం... ఇన్స్టాలో మహేష్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ !
ABN, First Publish Date - 2023-02-22T15:23:46+05:30
పెళ్లయ్యాక హానీమూన్ కి ఎక్కడికి వెళ్లారు, ఎలా జరిగింది అనే విషయాలు వీళ్లిద్దరి అభిమానులకి చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. అందుకనే కియారా (#KiaraAdvani) వాళ్ళందరి కోసం ఒక పోస్ట్ తన సాంఘీక మాధ్యమం లో షేర్ చేసింది.
బాలీవుడ్ నటీనటులు సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), కియారా అద్వానీ (Kiara Advani) కొన్ని రోజుల కిందటే ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంతకు ముందు ఇలా చేసుకున్న చాలామంది బాలీవుడ్ జంటలు అయిన దీపికా రణవీర్ (#DeepikaRanveer), అలియా రణబీర్ (#ranabiralia), వికీ కౌశల్ కత్రినా (#VickyKatrina), ఇలా మరికొంత మంది తో ఈ సిద్ కియారా జంట కూడా కలిసింది. వీళ్లందరినీ బాలీవుడ్ లో ఒక ప్రతేయకమయిన జంటలుగా పిలుస్తూ వుంటారు. వీరి వివాహం రాజస్థాన్ లోని సూర్యగఢ్ ప్యాలెస్లో అట్టహాసంగా రంగరంగ వైభోగంగా జరిగింది. (#SidKiara)
బాలీవుడ్ నుండి అనేకమంది నటీనటులు, ఇంకా ఇతర సెలెబ్రిటీలు చాలామంది ఈ యువజంట పెళ్ళికి హాజరయ్యారు. అయితే ఈ జంట పెళ్లి అయినా తరువాత హానీమూన్ కి వెళ్లి ఈమధ్యనే ముంబై చేరుకున్నారు. పెళ్లయ్యాక హానీమూన్ కి ఎక్కడికి వెళ్లారు, ఎలా జరిగింది అనే విషయాలు వీళ్లిద్దరి అభిమానులకి చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. అందుకనే కియారా (#KiaraAdvani) వాళ్ళందరి కోసం ఒక పోస్ట్ తన సాంఘీక మాధ్యమం లో షేర్ చేసింది. అది కూడా హిందీ సినిమాల్లో శోభనం పాటల్లో లాగా కియారా ఆ విషయాన్ని షేర్ చేసింది. "ఆ రాత్రి గురించి ఏం చెప్పాలి.. సమ్థింగ్ రియల్లీ స్పెషల్ (sic)" అని ఇన్ స్టాలో ఒక పోస్ట్ పెట్టింది.
ఆలా రాత్రి గురించి ఒక పోస్ట్ పెట్టడమే కాకుండా తాను, సిద్ధార్థ్ (#SiddharthMalhotra) కలిసి వున్న ఫోటో ని కూడా షేర్ చేసింది. ఆమె పోస్ట్ కి ఆమె అభిమానులు చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ పెట్టారు కానీ అందరూ ఆమె సంతోషంగా ఉంటే చాలు అన్నట్టుగానే పెట్టారు. హానీమూన్ కి వెళ్లే ముందు ఈ కొత్తగా పెళ్లయిన జంట ఢిల్లీ లో తమ స్నేహితులకి, మిగతా వాళ్లకి రిసెప్షన్ కూడా ఇచ్చారు.