#BoycottBollywood: ‘సినిమాలు లేకపోతే మీ పరిస్థితి ఏంటి?’.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కరీనా
ABN, First Publish Date - 2023-01-23T15:31:45+05:30
బాలీవుడ్(Bollywood)లోని టాప్ హీరోయిన్స్‌లలో కరీనా కపూర్ (Kareena Kapoor) ఒకరు.
బాలీవుడ్(Bollywood)లోని టాప్ హీరోయిన్స్‌లలో కరీనా కపూర్ (Kareena Kapoor) ఒకరు. సినిమాలకి కొంచెం గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఫ్యామిలీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అయితే.. అప్పుడప్పుడు పబ్లిక్ ఫంక్షన్లలో సందడి చేస్తుంటుంది. ఈ బ్యూటీ తాజాగా కోల్‌కతాలో జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యంగ్ లీడర్స్ ఫోరం కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా బాలీవుడ్‌లోని బాయ్‌కాట్ కల్చర్ (#BoycottBollywood) గురించి ఈ భామ స్పందించింది.
కరీనా మాట్లాడుతూ.. ‘నేను బాయ్‌కాట్ కల్చర్‌తో ఏకీభవించను. అలా జరిగితే, మేము ఎలా వినోదాన్ని పంచగలుగుతాం. మీ జీవితంలోకి ఆనందం, సంతోషం ఎలా వస్తుంది. ఈ ఆలోచన అందరిలో ఉండాలని భావిస్తున్నాను. అసలు సినిమాలే లేకపోతే అందరి జీవితాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా ఉంటుంది’ అని చెప్పుకొచ్చింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం బాలీవుడ్‌లో ఎక్కువగా బాయ్‌కాట్ ట్రెండ్ మొదలైంది.2022లో లాల్ సింగ్ చద్దా, లిగర్, బ్రహ్మాస్త్ర, రక్షా బంధన్ వంటి అనేక చిత్రాల విడుదలకు ముందు నెటిజన్లు బాయ్‌కాట్ చేయాలంటూ నెట్టింట ట్రెండ్ చేశారు. వివిధ కారణాలను చూపుతూ ఈ సినిమాలను బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండ్ చేశారు.