Karan johar: తమిళ సినిమా దెబ్బకి వెనక్కి తగ్గిన కరణ్ జోహార్
ABN, First Publish Date - 2023-02-02T15:04:52+05:30
చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ (Karan johar) ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహనీ’ (Rocky Aur Rani Ki Prem Kahani)కి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ (Karan johar) ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహనీ’ (Rocky Aur Rani Ki Prem Kahani)కి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అలియా భట్(Alia Bhatt), రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) జంటగా నటిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోంది. ఈ మూవీ విడుదల తేదీని కరణ్ తాజాగా ప్రకటించాడు. ఈ చిత్రం జూలై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్‌లో ఈ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు.
నిజానికి ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. కానీ అదే తేదీకి కార్తీక్ ఆర్యన్ నటించిన ‘షెహజాదా’ విడుదల కానుంది. దీంతో ఆ చిత్రంలో క్లాష్ కాకుండా ఉండటానికి విడుదల తేదిని ఏప్రిల్ 29కి మార్చారు. అయితే తాజాగా ఆ తేదీని కూడా మూవీ టీం మార్చింది. దానికి కారణం మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్ 2’ (Ponniyin Selvan 2). గతేడాది విడుదలై సూపర్ హిట్ సాధించిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’ సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ మూవీతో క్లాష్ లేకుండా ఉండటానికి తన చిత్ర విడుదల తేదిని కరణ్ జూలైకి మార్చాడు.
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి కరణ్ తెలిపాడు. ‘ఓపిక కష్టంగా ఉంటుంది. కానీ రిజల్ట్ మాత్రం బావుంటుంది. ఓ ప్రేమకథలోని తీపిని పంచడానికి రాబోతున్నాం. రాఖీ, రాణి కుటుంబాలు మీకు అపురూపమైన ప్రేమ కథను అందించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ చిత్రం జూలై 28, 2023న థియేటర్స్‌లో విడుదల అవుతుంది’ అని రాసుకొచ్చాడు.