కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

OTT - Tejas: తేజస్  ఓటీటీ  స్ట్రీమింగ్  ఎక్కడంటే

ABN, Publish Date - Dec 26 , 2023 | 05:21 PM

వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ (kangana Ranat). ఫీమేల్‌ సెంట్రిక్‌ సినిమాలతో స్టార్‌ హీరోలతో సైతం పోటీగా మారింది. సినిమాలే కాకుండా వివాదాలకు ఆమె కేంద్ర బిందువుగా మారింది.

వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ (kangana Ranat). ఫీమేల్‌ సెంట్రిక్‌ సినిమాలతో స్టార్‌ హీరోలతో సైతం పోటీగా మారింది. సినిమాలే కాకుండా వివాదాలకు ఆమె కేంద్ర బిందువుగా మారింది. ఈ ఏడాది 'తేజస్‌’ (Tejas) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అక్టోబర్‌ 27న విడుదలైన ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. ఆ తర్వాత చంద్రముఖి - 2తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమా కూడా ఆకట్టుకోలేదు.

తాజాగా 'తేజస్‌' చిత్రం ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 5 నుంచి జీ5  స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. 2016లో భారత వైమానిక దళంలోకి మొట్టమొదటి సారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందింది. సర్వేష్‌ మేవారా దర్శకత్వం వహించారు. రోనీ స్ర్కూవాలా నిర్మించారు. ప్రస్తుతం 'ఎమర్జన్సీ’ చిత్రంతో నటిస్తోంది కంగనా. 


Updated Date - Dec 26 , 2023 | 05:34 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!