Thalaivi: వివాదంలో కంగన సినిమా.. కోర్టును ఆశ్రయించనున్న డిస్ట్రిబ్యూటర్..
ABN, First Publish Date - 2023-03-22T14:45:11+05:30
మాటలను తూటల్లా పేల్చే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). అభిమానులందరు ముద్దుగా ఫైర్ బ్రాండ్ అని పిలుస్తుంటారు. ఆమె నటించిన సినిమా ‘తలైవి’ (Thalaivi).
మాటలను తూటల్లా పేల్చే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). అభిమానులందరు ముద్దుగా ఫైర్ బ్రాండ్ అని పిలుస్తుంటారు. ఆమె నటించిన సినిమా ‘తలైవి’ (Thalaivi). తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalithaa) జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. ‘తలైవి’ లో జయలలిత పాత్రను కంగన పోషించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కానీ, ఈ చిత్రం పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టలేకపోయింది. అందువల్ల ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్ డబ్బును వెనక్కి ఇవ్వాలని నిర్మాతలను కోరుతున్నారు.
‘తలైవి’ సినిమా వరల్డ్‌వైడ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం జీ స్టూడియోస్ నిర్మాణ సంస్థకు రూ.6కోట్లను అడ్వాన్స్‌గా చెల్లించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయింది. డిస్ట్రిబ్యూటర్ కూడా భారీగా నష్టపోయారు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థకు జీ స్టూడియోస్ ఇమెయిల్ పంపించింది. రూ.6కోట్లను తిరిగి ఇవ్వాలని కోరింది. అయితే, ‘తలైవి’ మేకర్స్ నుంచి మాత్రం స్పందన రాలేదని తెలుస్తోంది. అందువల్ల జీ సంస్థ కోర్టు మెట్లు ఎక్కబోతున్నట్టు రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి.
‘తలైవి’ కి నిర్మాతలుగా విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్, బృందా ప్రసాద్ వ్యవహరించారు. రూ.100కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. కంగన చివరి చిత్రం ‘ధాకడ్’ మేకర్స్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్స్ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు.
^^^^^^^^^^^^^^^^^^^^^
ఇవి కూడా చదవండి:
Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..
Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా
Oscars 2023: షాక్.. ఆస్కార్ వేడుకకు ఫ్రీ పాస్‌లు లేకపోవడంతో.. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ భారీ ఖర్చు..
RRR: రామ్ చరణ్, తారక్ అందువల్లే ఆస్కార్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయలేదు!
Allu Arjun: హీరోయిన్ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!
Pawan Kalyan: నా రెమ్యునరేషన్ రోజుకు రెండు కోట్లు
Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!