సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kangana Ranaut: కార్‌వ్యాన్ మార్పులు, చేర్పులకు భారీగా వెచ్చించిన నటి

ABN, First Publish Date - 2023-03-19T19:01:44+05:30

బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్స్‌లో కంగనా రనౌత్ (Kangana Ranaut) ఒకరు. రాజకీయాలతో పాటు సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను ఎటువంటి సంకోచం లేకుండా వెల్లడిస్తుంటారు. సినిమా కోసం ఎటువంటి కష్టనష్టాలైనా భరిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్స్‌లో కంగనా రనౌత్ (Kangana Ranaut) ఒకరు. రాజకీయాలతో పాటు సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను ఎటువంటి సంకోచం లేకుండా వెల్లడిస్తుంటారు. సినిమా కోసం ఎటువంటి కష్టనష్టాలైనా భరిస్తారు. సెలబ్రిటీలలో అత్యంత ఖరీదైన కార్ వ్యాన్ కంగనా రనౌత్ దేనట. ఈ విషయాన్ని కార్ వ్యాన్స్‌ను తయారు చేసే వ్యక్తి కేతన్ రావల్ చెప్పారు.

కంగనా రనౌత్ గతంలో ‘రంగూన్’ (Rangoon) లో నటించారు. ఈ మూవీ షూటింగ్ అరుణా ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాల్లో జరిగింది. అక్కడ రెస్టారెంట్స్, రెస్ట్‌రూమ్స్ లేవు. పలితంగా పెద్దపెద్ద రాళ్ల వెనక్కు వెళ్లి కాలకృత్యాలు తీసుకోవాల్సి వచ్చేదని ఆమె చెప్పారు. ఇటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఓ ఖరీదైన వ్యానిటీ వ్యాన్‌ను ఆమె కోనుగోలు చేశారు. తన అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా మార్పించుకున్నారు. ఇంటిని తలపించేలా మార్పులు, చేర్పులు చేయించుకున్నారు. కంగన వ్యాన్‌ను కస్ట్‌మైజ్ చేయడానికి దాదాపుగా రూ.65లక్షలు అయ్యిందని సమాచారం. షారూఖ్ ఖాన్ కార్ వ్యాన్ భారీగా ఉంటుందట. ప్రతి చోటుకు ఇది వెళ్లళేదని సమాచారం. సినీ ఇండస్ట్రీకి వ్యానిటీ వ్యాన్స్‌ను పరిచయం చేసిన ఘనత పూనమ్ థిల్లాన్‌కు దక్కుతుంది. ఈ కార్‌వ్యాన్‌ను శ్రీదేవి, అనిల్ కపూర్, అమితాబ్ బచ్చన్ ఒపెన్ చేశారు.

కంగనా రనౌత్ తాజాగా ‘ఎమర్జెన్సీ’ (Emergency) లో నటించారు. ఈ సినిమాకు ఆమెనే నిర్మాతగా వ్యవహరిస్తూ దర్శకత్వం వహించారు. ‘చంద్రముఖి-2’ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. లారెన్స్‌కు జోడిగా కనిపించనున్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా

Oscars 2023: షాక్.. ఆస్కార్ వేడుకకు ఫ్రీ పాస్‌లు లేకపోవడంతో.. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ భారీ ఖర్చు..

RRR: రామ్ చరణ్, తారక్ అందువల్లే ఆస్కార్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయలేదు!

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Pawan Kalyan: నా రెమ్యునరేషన్ రోజుకు రెండు కోట్లు

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Updated Date - 2023-03-19T19:01:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!