సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kangana Ranaut: తనని ట్రోల్ చేయమంటున్న కంగనా.. దేనికోసమంటే..

ABN, First Publish Date - 2023-04-03T13:22:30+05:30

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ (Kangana Ranaut) ముక్కుసూటితనం గురించి అందరికీ తెలిసిందే.

Kangana Ranaut on Hindi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ (Kangana Ranaut) ముక్కుసూటితనం గురించి అందరికీ తెలిసిందే. ఏ విషయం మీదైనా ఎటువంటి భయం లేకుండా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతూ ఉంటుంది. దాని వల్ల వివాదాల్లో సైతం ఇరుక్కుంటూ ఉంటుంది. అయినా వాటిని పట్టించుకోకుండా.. తన ధోరణిని అలాగే ప్రదర్శిస్తూ ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ (Bollywood) చిత్ర పరిశ్రమలోని నేపోటిజంపై, మాఫియాపై విమర్శలు గుప్పించడం కంగనకి బాగా అలవాటు. తాజాగా దేశంలో హిందీ మాట్లాడే పిల్లల యాస గురించి ఈ భామ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

ట్విట్టర్‌లో ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌ని కంగనా రీ ట్వీట్ చేసింది. అందులో.. ‘నన్ను ద్వేషించండి పర్వాలేదు. కాని, గురుగ్రామ్‌లోని చాలా మంది పిల్లలు కేవలం ఇంగ్లిష్‌లో మాత్రమే మాట్లాడతారు. అలాగే.. హిందీని మాత్రం పూర్తిగా అర్థం చేసుకోలేరు. నిజం చెప్పాలంటే.. వారు హిందీ మాట్లాడటం మర్చిపోయారు’ అని రాసుకొచ్చారు. (Speaking Hindi In Tacky Second Hand)

ఆ ట్వీట్‌ని షేర్ చేసిన కంగన దానికి.. ‘నేను ట్రోలింగ్‌ని ఆహ్వానిస్తున్నా. చేయండి పర్వాలేదు. కానీ, నిజాయతీగా చెప్పాలంటే.. ఇంగ్లిష్ మాట్లాడే మన దేశ పిల్లలు చెత్త యాసలో హిందీ మాట్లాడుతూ చిరాకు కలిగిస్తూ ఉంటారు. అయితే ప్రామాణికమైన దేశీయ యాసలో హిందీ లేదా సంస్కృతం అనర్గళంగా మాట్లాడే పిల్లలు ఎప్పుడూ టాప్‌లో ఉంటారు’ అని సమాధానంగా రాసుకొచ్చింది. ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. కంగనా చెప్పింది నిజమేనని రాసుకొస్తున్నారు. (Kangana Ranaut On Desi kids hindi)

‘ఇటీవలికాలంలో కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలను ఎలా పెంచుతున్నారో తెలియట్లేదు. వారికి కనీస విలువలు కూడా నేర్పలేకపోతున్నారు. ఈ తరం పిల్లలపై ప్రాశ్చాత్య దేశాల ప్రభావం ఎక్కువగా ఉంటోంది’ అని ఒకరు.. ‘జపాన్, చైనా, ప్రాన్స్ వంటి ఇతర దేశాలు తమ సొంత భాషలకి ప్రాముఖ్యత ఇస్తుండగా.. మనం మాత్రం ఇంగ్లిష్ వెంటపడుతున్నాం. తమ సొంత భాషని నేర్చుకోలేని ఈ తరం పిల్లలు సిగ్గుపడాలి’ అని మరో నెటిజన్ ఘాటుగా రాసుకొచ్చాడు.


ఇవి కూడా చదవండి:

Janhvi Kapoor: తిరుమలలో బాయ్‌ఫ్రెండ్‌తో జూనియర్ శ్రీదేవి.. తర్వాత అడుగు అటువైపేనా?

Varun Dhawan: స్టేజీపై మోడల్‌కు ముద్దు పెట్టినందుకు ట్రోలింగ్.. వెటకారంగా రిప్లై ఇచ్చిన యంగ్ హీరో

Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..

IPS Sajjanar: దయచేసి అలా చేయకండి.. అమితాబ్‌కి టీఎస్‌ఆర్టీసీ ఎండీ రిక్వెస్ట్

Adipurush: మరోసారి ప్రభాస్ మూవీ పోస్టర్‌పై ట్రోలింగ్.. ఈసారి హనుమంతుడి గెటప్‌పై..

Updated Date - 2023-04-03T13:22:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!