కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kangana Ranaut: ఇప్పుడైనా మారుతుందా.. ఆ ధోరణిలో ఉంటుందా? 

ABN, Publish Date - Dec 21 , 2023 | 05:12 PM

సినిమాలకు, రాజకీయానికి బలమైన సంబంధం ఉంది. సినిమాల నుంచి రాజకీయాల్లో వెళ్లినవారు చాలామంది ఉన్నారు. రాజకీయాలు సెట్‌ అవ్వక మళ్లీ సినిమాల్లోకి వచ్చినవారూ ఉన్నారు. తాజాగా ఓ యంగ్‌ హీరోయన ఈ జాబితాలో చేరనుంది. ఆమె బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌, క్వీన్‌ కంగనా రనౌత్‌. ప్రస్తుతం కంగనా పొలిటికల్‌ ఎంట్రీ గురించి బాలీవుడ్‌లో వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

సినిమాలకు, రాజకీయానికి బలమైన సంబంధం ఉంది. సినిమాల నుంచి రాజకీయాల్లో వెళ్లినవారు చాలామంది ఉన్నారు. రాజకీయాలు సెట్‌ అవ్వక మళ్లీ సినిమాల్లోకి వచ్చినవారూ ఉన్నారు. తాజాగా ఓ యంగ్‌ హీరోయన ఈ జాబితాలో చేరనుంది. ఆమె బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌, క్వీన్‌ కంగనా రనౌత్‌(Kangana ranut) . ప్రస్తుతం కంగనా పొలిటికల్‌ ఎంట్రీ గురించి బాలీవుడ్‌లో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. దాని గురించి మాత్రమే కాదు.. ఎన్నికల విషయంపై కూడా కంగనా.. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చినట్టు బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. కంగనా రనౌత్‌.. మొదటినుంచి బీజేపీకి సపోర్ట్‌గా ఉంది. ఎన్నో సందర్భాల్లో అది రుజువైంది. ఆమె బీజేపీలో జాయిన్‌ అవ్వనుందని కూడా వార్తలొచ్చాయి. బీజేపీ నేషనల్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డాను ఆమె కలవడమే అందుకు కారణం. ఆదివారం ఆమె జేపీ నడ్డాతో సమావేశమయ్యింది. సంబంధిత ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దాంతో ఆమె పొలిటికల్‌ పార్టీలో చేరనుందని టాక్‌ మొదలైంది. తాజాగా ఇదే విషయాన్ని కంగనా తండ్రి కన్ఫర్మ్‌ చేశారు. (kangana ranaut emergency)

బీజేపీ ద్వారా పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వడం మాత్రమే కాకుండా.. 2024లో జరిగే లోక్‌ సభ ఎన్నికల్లో కూడా పోటీ చేయనుందని టాక్‌ వినిపిస్తోంది. అప్పటిలోపు తన చేతిలో ఉన్న చిత్రాలు పూర్తి చేసే పనిలో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితేఏదైనా ముక్కుసూటిగా మాట్లాడి, వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే కంగనా రాజకీయాల్లో ఎలా నెగ్గుకొస్తుంది. తన తీరు ఏమైనా మార్చుకుంటుందా అన్న సందేహం కూడా వ్యక్తంచేప్తున్నారు.  ఏం జరుగుతుందనే చూడాలి. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు చిత్రాలున్నాయి. అందులో ఒకటి ‘ఎమర్జెన్సీ’. 1975 నుంచి 1977 మధ్యలో ఇండయాలో నిర్వహించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో కంగనా రనౌత్‌.. ఇందిరా గాంధీ పాత్రలో నటించింది. ఈ చిత్రంలో నటించడమే కాకుండా దర్శకత్వం  వహించింది. (emergency Movie)

Updated Date - Dec 21 , 2023 | 05:17 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!