సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kangana Ranaut: మాఫియా చేసిన పెళ్లి నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నాడు.. ఎవరి కోసం ఈ పోస్ట్‌!

ABN, First Publish Date - 2023-07-18T20:47:35+05:30

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ‘పేమ కోసం కాకుండా డబ్బు కోసం పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఇలానే ఉంటుంది’ అంటూ ఆమె చేసిన పోస్ట్‌ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తన కొత్త సినిమాపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆమె స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ‘పేమ కోసం కాకుండా డబ్బు కోసం పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఇలానే ఉంటుంది’ అంటూ ఆమె చేసిన పోస్ట్‌ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తన కొత్త సినిమాపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆమె స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కంగనా రనౌత్‌, కోలీవుడ్‌ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay sethupathi) కలిసి నటించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఓ చిత్రం రూపొందుతున్నట్లు వార్తలొచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా ఆ వార్తపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మొదలైంది. ఆ వార్తలకు సంబంధించిన స్ర్కీన్‌ షాట్‌లను ఇన్‌స్టాగ్రామ్‌ స్టాటస్‌లో పోస్ట్‌ చేశారామె. ‘‘నేనెప్పుడు ఏ సినిమాని ప్రకటించినా, ప్రకటించబోతున్నా ఇలాంటి నెగెటివ్‌ ప్రచారం జరుగుతుంది. అయితే న్యూస్‌ వచ్చిన ప్రతి వెబ్‌సైట్‌లోనూ ఒకే హైడ్‌లైన్‌ ఉండడానికి కారణమేంటి? దీనినే బల్క్‌ మాస్‌ మెయిల్‌ అంటారు. ప్రియమైన ‘చాంగు మంగు’ మీ మంచి కోసం నేను దైవాన్ని ప్రార్థిస్తున్నా’’ అని పేర్కొంది. బాలీవుడ్‌కు చెందిన ఓ జోడీనే పలువురు నెటిజన్లతో ఈ ట్రోలింగ్‌ చేయిస్తుందని కంగనా ఆరోపించింది. ఈ మేరకు మరో పోస్ట్‌ చేసింది. (Trolling on Kangana)

‘‘వేర్వేరు ప్లాట్స్‌లో ఉండే ఓ నకిలీ జోడీ ఇటువంటి ప్రచారం చేయిస్తోంది. భార్య, బిడ్డను వదిలేసి భర్త విహారయాత్రకు వెళ్తే దాని గురించి ఎవరూ రాయరు. సదరు భర్త నాకు విజ్ఞప్తి చేస్తున్నాడు. చర్చించేందుకు నన్ను కలవమంటున్నాడు. సినిమాలు డబ్బు కోసం పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటుంది. ఈ నటుడు ‘మాఫియా డాడీ’ ఒత్తిడిలో పెళ్లి చేసుకున్నాడు. ఫేక్‌ మ్యారేజ్‌ నుంచి బయటపడేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడు. కానీ, అతడికి సహకరించేవారు ఎవరూ లేరు. భార్య, కుమార్తెపైనే అతడు దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇది ఇండియా. ఒక్కసారి పెళ్లి అయితే.. అంతే!’’ అని కంగనా వ్యాఖ్యానించింది. కంగనా నటించిన చిత్రాలు విడుదలకు వరుస కట్టాయి. ‘చంద్రముఖి 2’ సెప్టెంబరులో, ‘తేజస్‌’ అక్టోబరు 20న, ‘ఎమర్జెన్సీ’ నవంబరు 24న విడుదల కానున్నాయి.

Updated Date - 2023-07-18T20:57:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!