కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Janhvi Kapoor: పరికిణీలో పదహారణాల తెలుగు అమ్మాయిలా.... ఆమెతో వచ్చిన ఆ అబ్బాయి...

ABN, First Publish Date - 2023-08-28T17:04:10+05:30

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం సందర్శించి తన మొక్కును తీర్చుకుంది. అయితే ఆమెతో పాటు ఒక అబ్బాయి కూడా వున్నాడు, ఇంతకీ ఆ అబ్బాయి ఎవరబ్బా అని ఆరా తీస్తే అతను....

Janhvi Kapoor with her rumored boyfriend at Tirumala

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (JanhviKapoor) వార్తల్లోనో, తన సాంఘీక మాధ్యమం ద్వారానో, లేదా ఎక్కడికైనా పర్యటిస్తూనో ఎప్పుడూ ఎదో ఒకటి చేస్తూ వార్తల్లో ఉంటూ ఉంటుంది. జాన్వీ కపూర్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆమె ఎప్పుడూ తిరుమల వస్తూ ఉంటుంది, శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటుంది. అలాగే ఈరోజు ఉదయం విఐపి దర్శన సమయంలో జాన్వీ కపూర్ శ్రీవారిని దర్శించుకొని బయటకి వచ్చింది. (Janhvi Kapoor visited Tirumala and offered prayers to Lord Venkateswara)

ఈరోజు ఆమె అచ్చం పదహారణాల తెలుగు అమ్మాయిల ముస్తాబయి వచ్చింది. పరికిణీలో వున్న జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని సన్దరిస్చుకొని బయటకి వచ్చిన తరువాత కూడా, వెనక్కి చూసుకుంటూ, స్వామికి దండాలు పెట్టుకుంటూ, మళ్ళీ బయటకి వచ్చి, స్వామికి సాక్షాత్కార నమస్కారాలు చేసుకుంటూ కనిపించింది. అయితే ఆమె తో వచ్చిన ఆ అబ్బాయి ఆమె బాయ్ ఫ్రెండ్ షిఖర్ పహారియా (ShikharPahariya) అని అతను కూడా ఆమెతో ఉన్నట్టు చెపుతున్నారు.

బాలీవుడ్ లో బిజీగా వున్న జాన్వీ ఇప్పుడు దక్షిణాదిలో కూడా సినిమాలు చెయ్యాలని చూస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ (NTR) పక్కన 'దేవర' #Devara తెలుగు సినిమాలో చేస్తోంది. ఈ సినిమాలో ఆమె తెలుగు అమ్మాయిలా కనపడనుందని, కొంచెం డి-గ్లామరైజ్డ్ పాత్ర అని కూడా అంటున్నారు. కొరటాల శివ (KoratalaSiva) దీనికి దర్శకుడు. ఈ సినిమా రావటం కోసం ఎన్నో మొక్కులు మొక్కనని కూడా చెప్పింది. ఆమె ఇలా ఒక పెద్ద సినిమా ద్వారా తెలుగులో పరిచయం అవటం చాలా సంతోషంగా ఉందని కూడా చెప్పింది. ఇందులో సైఫ్ అలీ ఖాన్ (SaifAliKhan) ముఖ్యమైన విలన్ పాత్రలో కనపడనున్నాడు.

Updated Date - 2023-08-28T17:04:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!