Sridevi Google doodle: తల్లిని గుర్తు చేసుకుని.. భావోద్వేగ పోస్ట్!
ABN, First Publish Date - 2023-08-13T22:51:48+05:30
జాన్వీ కపూర్ భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లి, దివంగత నటి శ్రీదేవిని తలచుకుంటూ జాన్వీకపూర్ కన్నీటిపర్యంతమయ్యారు. మా ప్రతి అడుగులోనూ నువ్వు ఉన్నావ్ అమ్మా.. మా ఎదుగుదలకు కారణం నువ్వే అంటూ అమ్మతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంది.
జాన్వీ కపూర్ (Janhvi Kapoor ) భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లి, దివంగత నటి శ్రీదేవిని (Sridevi) తలచుకుంటూ జాన్వీకపూర్ కన్నీటిపర్యంతమయ్యారు. మా ప్రతి అడుగులోనూ నువ్వు ఉన్నావ్ అమ్మా.. మా ఎదుగుదలకు కారణం నువ్వే అంటూ అమ్మతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంది. ఆగస్ట్ 13న శ్రీదేవి జయంతి సందర్భంగా జాన్వీ సోషల్ మీడియా వేదికగా శ్రీదేవి తన తల్లితో కలిసి దిగీన ఫొటోను పంచుకుంటూ తన మాతృమూర్తి గురించి పోస్ట్ పెట్టారు. ‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా. అమ్మమ్మతో నువ్వు కలిసి నీకు ఎంతో ఇష్టమైన సినిమా సెట్‌ఫోటో ఇది. నీకు ఇష్టమైన ప్రదేశాల్లో షూటింగ్ స్పాట్ ఒకటని నాకు తెలుసు. నేను కూడా ఈ రోజు సినిమా సెట్స్‌లో ఉన్నా. నువ్వు నాతోనే ఉండాలని ఎప్పటి కంటే ఎక్కువగా కోరుకుంటున్నా. ఇది మీ 60వ పుట్టినరోజు అయినా 35వ పుట్టిన రోజు అని కన్విన్స్ చేయగలం. నేను ఎంత ఒత్తిడి తీసుకుంటున్నాను అనేది మీరే చెప్పగలరు. మీరు గర్వించేలా చేస్తున్నానా లేదా అన్నది మీ కళ్లల్లో చూడగలను. ప్రతిరోజూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటానమ్మా. ఈ భూమ్మీద నాకు నువ్వెంతో ప్రత్యేకం. ఇప్పటికీ నువ్వు మాతో ఉన్నావని బలంగా నమ్ముతున్నా.. నీకు బాగా ఇష్టమైన పాయసం, ఐస్‌క్రీమ్ తింటావని ఆశిస్తున్నా’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది జాన్వీ.
తల్లిని స్ఫూర్తిగా తీసుకుని 2018లో ‘ధడక్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్‌లో గుర్తింపు పొందింది. ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రమిది. జాన్వీ సోదరి ఖుషీ కపూర్ కూడా నటిగా మారింది.
గూగుల్ డూడుల్... (Sridevi Google Doodle)
1963 ఆగస్టు 13న జన్మించిన శ్రీదేవి ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అగ్ర హీరోల సరసన నటించి అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. అతిలోక సుందరిగా పేరు పొందింది. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో మరణించారు. శ్రీదేవి 60వ జయంతిని పురస్కరించుకుని సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఆమె ఫొటోతో కూడిన ప్రత్యేక డూడుల్‌ని రూపొందించింది.
.