Ileana: నా కన్నీళ్లు తుడిచాడు.. తన ప్రియుడిపై ఇలియానా ఆసక్తికరమైన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-06-12T18:18:00+05:30
ఈమధ్య కొన్ని కష్టమైన రోజులు గడిచాయి. ఆ పరిస్థితులు నన్ను గందరగోళానికి గురి చేశాయి. అయితే వాటి నుంచి నేను క్రమంగా బయటపడ్డా. ఆ క్షణంలో తను నా చెంత ఉన్నాడు, నా కన్నీళ్లు తుడిచాడు, నా జీవితంలో చిరునవ్వులు పూయించాడు అంటూ సోషల్ మీడియా వేదికగా ఇలియానా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
‘అమ్మ’ (Mother) పదవి ఆడవాళ్లకు మాత్రమే దక్కే అదృష్టం. గర్భం దాల్చిన దగ్గర్నుంచి, ఓ బిడ్డకు జన్మనిచ్చేంత వరకూ ఉండే దశ... ఓ అపురూపమైన ప్రయాణం. అదెలా ఉంటుందో మాటల్లో చెప్పలేనంటోంది ఇలియానా (Ileana DCruz). ఎందుకంటే ఇప్పుడు తను కూడా ఓ బిడ్డకు తల్లికాబోతోంది. ఈ విషయాన్ని ఇటీవలే సోషల్ మీడియా ద్వారా తెలియపరిచింది. అంతేకాదు, బేబీ బంప్ (Ileana Baby Bump)తో ఉన్న ఓ ఫొటోని కూడా ఇప్పటికే ఇలియానా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘అమ్మ’ పదవి గురించి రాసిన ఈ పోస్ట్‌తో పాటు ఆమె షేర్ చేసిన ఫొటో కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
ఆ ఫొటోలో ఉన్న పర్సనల్ ఎవరనేది తెలియనివ్వకుండా.. అతనెవరో చెప్పకుండా.. ఇలియానా (Ileana) ఈ పోస్ట్ చేసింది. ఈ పిక్‌ని పరిశీలిస్తే.. అతనే తన ‘అమ్మ’ పదవికి (Mother Role) కారణం అని తెలుస్తోంది. ఎందుకంటే.. ఈ పిక్‌లో ఇలియానా అతనితో లిప్ కిస్ (LipLock)కి సిద్ధమవుతున్నట్లుగా ఉంది. ఈ పిక్‌తో పాటు ఆమె ఏం తెలిపిందంటే..
‘‘తల్లికావడం ఓ అద్భుతమైన అనుభూతి. మాటల్లో వర్ణించలేనిది. ఈ క్షణాల్ని ఆస్వాదిస్తున్నా. నాలో ఓ జీవి ప్రాణం పోసుకొంటుందన్న ఊహే అపురూపంగా అనిపిస్తోంది. నా బిడ్డ బయటకు వచ్చాక తనని ఎంత ప్రేమిస్తానో, ఎలా చూసుకొంటానో నాకు తెలీదు. కానీ ఇప్పటికైతే అమితంగా ఇష్టపడుతున్నా’’ అంటూ ఓ ఉద్వేగభరితమైన పోస్ట్ పెట్టింది. ఇంకా.. ‘‘ఈమధ్య కొన్ని కష్టమైన రోజులు గడిచాయి. ఆ పరిస్థితులు నన్ను గందరగోళానికి గురి చేశాయి. అయితే వాటి నుంచి నేను క్రమంగా బయటపడ్డా. ఆ క్షణంలో తను నా చెంత ఉన్నాడు, నా కన్నీళ్లు తుడిచాడు, నా జీవితంలో చిరునవ్వులు పూయించాడు’’ అంటూ తన ప్రియుడి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి:
************************************************
*Gopichand: ‘రామబాణం’ తర్వాత మరో పవర్ఫుల్ టైటిల్‌తో.. ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల
*********************************************************************
*Sreeleela: నిర్మాతలకు ‘నో’ చెబుతున్న శ్రీలీల
*****************************************************************
*Samantha: క్లబ్లో బీర్ కొడుతూ.. ‘ఊ అంటావా మావ’ పాటకి నాటు నాటు స్టెప్స్.. వీడియో వైరల్
*************************************************************
*VarunLav: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ ఫొటోలు
***********************************
*Sharwa-Rakshita: శర్వానంద్, రక్షితల వెడ్డింగ్ రిసెప్షన్లో సెలబ్రిటీల సందడి
***********************************************************