Huma Qureshi: వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు..
ABN, First Publish Date - 2023-07-29T16:16:29+05:30
సెలబ్రిటీలకు బాడీ షేమింగ్ (body Shaming) సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. సోషల్ మీడియా విస్తృతం కావడంతో అది మరింత పెరిగింది. సోషల్ మీడియా వేదికగా బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్న వారిలో బాలీవుడ్ నటి హుమా ఖురేషీ (Huma Qureshi)ఒకరు.
సెలబ్రిటీలకు బాడీ షేమింగ్ (body Shaming) సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. సోషల్ మీడియా విస్తృతం కావడంతో అది మరింత పెరిగింది. సోషల్ మీడియా వేదికగా బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్న వారిలో బాలీవుడ్ నటి హుమా ఖురేషీ (Huma Qureshi)ఒకరు. ఇండస్ర్టీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆమె బాడీ షేమింగ్‌కి గురవుతూనే ఉన్నారట. ఈ మధ్య కాస్త తగ్గినా, గతంలో ఓ రివ్యూవర్ మాత్రం తన బరువు గురించి కూడా విపరీతంగా ట్రోల్ చేశాడని చెప్పుకొచ్చింది. తన బరువుపై కామెంట్ చేయడమే ఎక్కువగా బాధించిందంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
‘‘అందరినీ అలరించాలనే సినిమాలు చేస్తాం. అది బాగోకపోతే కామెంట్ చేస్తుంటారు. అందులో తప్పులేదు. ఎందుకంటే అది మీ ఛాయిస్. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్?. ఒక వ్యక్తిని సోషల్ మీడియా వేదికగా ఎందుకు టార్గెట్ చేసిన ట్రోల్ చేయాలి. ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. నాకైతే ఇలాంటి అనుభావాలు చాలాసార్లు ఎదురయ్యాయి. రెండేళ్ల క్రితం నేను నటించిన సినిమా విడుదలైతే.. ఒక రివ్యూవర్ నా నటన గురించి మాట్లాడకుండా, నా బరువు గురించి రాశాడు. హీరోయిన్లకు ఉండాల్సిన దానికంటే, ఐదు కిలోలు ఎక్కువగా ఉన్నారని ఆ రివ్యూవర్ రాశాడు. అది చూసి, నాలో ఏమైనా లోపం ఉందా అనే డౌట్ వచ్చింది. ఆ విషయం నన్ను ఎంతో బాధించింది. సినిమాలకు రివ్యూలు రాసేవాళ్లు సినిమాలో తప్పు ఒప్పులను చెప్పాలి కానీ... వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమేంటి? నాన్‌సెన్స్! ఎదుగుతున్న మమ్మల్ని కిందకు లాగే ప్రయత్నంలో భాగమే ఇది. మొదట్లో ఇవన్నీ మనసుకు తీసుకునేదాన్ని. ఎదిగే క్రమంలో ఇవన్నీ సహజమని అలాంటివి పట్టించుకోవడం మానేశా’’ అని చెప్పారు.