Rajkumar Santoshi: ‘గాంధీ గాడ్సే ఏక్ యుధ్’ డైరెక్టర్‌కు బెదిరింపులు
ABN, First Publish Date - 2023-01-24T16:56:54+05:30
పఠాన్ సినిమాలోని ‘బే షరమ్ రంగ్’ సాంగ్ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. దీపికా పదుకొణె (Deepika Padukone) ధరించిన బికినీపై పలువురు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలు తగ్గు ముఖం పట్టిందనుకుంటున్న దశలో మరో ఫిల్మ్ మేకర్‌ను చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి.
సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. పఠాన్ సినిమాలోని ‘బే షరమ్ రంగ్’ సాంగ్ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. దీపికా పదుకొణె (Deepika Padukone) ధరించిన బికినీపై పలువురు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలు తగ్గు ముఖం పట్టిందనుకుంటున్న దశలో మరో ఫిల్మ్ మేకర్‌ను చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి.
‘గాయల్’, ‘దామిని’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజ్ కుమార్ సంతోషి (Rajkumar Santoshi). తాజాగా అతడు ‘గాంధీ గాడ్సే ఏక్ యుధ్’ (Gandhi Godse Ek Yudh) చిత్రాన్ని తెరకెక్కించాడు. మహాత్మా గాంధీ, నాథురాం గాడ్సేల భావజాలలను ఈ చిత్రంలో చూపించాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జనవరి 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో నాథురాం గాడ్సేని హైలైట్ చేయడంతో.. రాజ్ కుమార్ సంతోషిని చంపేస్తామని అనేక మంది బెదిరించారు. ఫలితంగా అతడు తనకు రక్షణను కల్పించాలని కోరుతూ ముంబై పోలీసులను ఆశ్రయించాడు.
రాజ్ కుమార్ సంతోషి తనకు భద్రతను కల్పించాలంటూ ముంబై పోలీసులకు లేఖను రాశాడు. ‘‘గాంధీ గాడ్సే ఏక్ యుధ్ సినిమా ప్రమోషన్, విడుదలను నిలిపివేయాలంటూ అనేక మంది అపరిచిత వ్యక్తులు నన్ను బెదిరిస్తున్నారు. అటువంటి వారు సమాజంలో తిరుగుతుంటే నాకు, నా కుటుంబ సభ్యులకు ఏదైనా జరుగుతుందోమోనని భయమేస్తుంది. అందువల్ల నాకు, కుటుంబ సభ్యులకు అదనపు భద్రతా సిబ్బందితో రక్షణ కల్పించాలి’’ అని రాజ్ కుమార్ లేఖలో పేర్కొన్నాడు.