Esha Gupta: సమంత లాంటి సమస్యేనని...
ABN, First Publish Date - 2023-07-29T12:40:45+05:30
బాలీవుడ్ నటి ఈషా గుప్తా (Eesha gupta) అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టా స్టోరీలో ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్న ఫొటో పోస్ట్ చేసిహైపర్బేరిక్ థెరపీ అని క్యాప్షన్ పెట్టింది. గతంలో సమంత ఇదే థెరపీ తీసుకున్నట్లు ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే!
బాలీవుడ్ నటి ఈషా గుప్తా (Eesha gupta) అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టా స్టోరీలో ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్న ఫొటో పోస్ట్ చేసిహైపర్బేరిక్ థెరపీ అని క్యాప్షన్ పెట్టింది. గతంలో సమంత ఇదే థెరపీ తీసుకున్నట్లు ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే! మయోసైటిస్ చికిత్సలో భాగంగా ఈ థెరపీ తీసుకుంటారు. దీని వల్ల కండరాలు బలపడతాయని, వాపు, ఇన్ఫెక్షన్ లాంటివి తగ్గుతాయని సామ్ పేర్కొంది. ఇప్పుడు ఈషా గుప్తా ఆక్సిజన్ మాస్క్‌తో కనిపించడంతో ఈమెకీ మయోసైటిస్ వచ్చిందా అనే సందేహం కలుగుతోంది. అయితే ఈషా మాత్రం తన ఏ సమస్యతో బాధపడుతున్నది వెల్లడించలేదు.
‘జనత్ 2’ చిత్రంతో బాలీవుడ్‌కి పరిచయమైన ఆమె పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. తెలుగులోనూ రెండు చిత్రాల్లో నటించింది. సచిన్ జోషి హీరోగా నటించిన ‘వీడెవడు’ ఒకటి కాగా, రామ్ చరణ్ (Ram Charan) ‘వినయ విధేయ రామ’ చిత్రంలో ‘ఏక్ బార్.. ఏక్ బార్’ అనే పాటలో సందడి చేసింది. ఆ తర్వాత ఆమె తెలుగు మరో చిత్రం చేయలేదు.