కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sanjay Gadhvi: బాలీవుడ్‌లో విషాదం.. ‘ధూమ్, ధూమ్ 2’ చిత్రాల దర్శకుడు మృతి

ABN, First Publish Date - 2023-11-19T15:50:06+05:30

బాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ‘ధూమ్, ధూమ్ 2’ చిత్రాల దర్శకుడు సంజయ్ గాధ్వీ (56) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన అనంతరం ఉదయం 9.30 నిమిషాల సమయంలో తీవ్ర స్థాయిలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారని.. ఆయన కుమార్తె సంజీనా చెప్పుకొచ్చారు.

Dhoom2 Director Sanjay Gadhvi

బాలీవుడ్‌ (Bollywood) సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ‘ధూమ్, ధూమ్ 2’ చిత్రాల దర్శకుడు సంజయ్ గాధ్వీ (56) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన అనంతరం ఉదయం 9.30 నిమిషాల సమయంలో తీవ్ర స్థాయిలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారని.. ఆయన కుమార్తె సంజీనా చెప్పుకొచ్చారు. మరణానికి కారణం గుండెపోటే అని ఆమె వెల్లడించారు. తన తండ్రికి ఎటువంటి అనారోగ్యం లేదని, సడెన్‌గా గుండెపోటు రావడం వల్లే ఆయన మృతి చెందారని సంజీనా మీడియాకు తెలియజేశారు.

సంజయ్ గాధ్వీ (Sanjay Gadhvi) బాలీవుడ్‌కు ‘తేరే లియే’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘కిడ్నాప్, మేరే యార్ కి షాదీ హై, అజబ్ గజబ్ లవ్, ధూమ్, ధూమ్ 2 (Dhoom2)’ వంటి యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన ఎన్ని సినిమాలు చేసినా.. ధూమ్ సీక్వెల్స్ చిత్రాలతో దర్శకుడిగా ఆయన స్టార్ రేంజ్‌కి చేరుకున్నారు. ధూమ్ సిరీస్ చిత్రాలతో హాలీవుడ్‌‌ రేంజ్ గుర్తింపును పొందారు. 2020లో విడుదలైన ‘ఆపరేషన్ పరిందే’ దర్శకుడిగా ఆయనకు చివరి చిత్రం. (Sanjay Gadhvi is No More)


మరో మూడు రోజులలో బర్త్‌డే జరుపుకోవాల్సిన సంజయ్ గాధ్వీ.. ఇలా సడెన్‌గా మృతి చెందడంతో ఫ్యామిలీ అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంజయ్ గాధ్వీ మరణ వార్త తెలిసి సినీ, రాజకీయ ప్రముఖులెందరో సంతాపం తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Yatra Raja: ధనుష్‌ పెద్ద కుమారుడికి జరిమానా.. ఎందుకంటే?

********************************

*Panja Vaishnav Tej: ‘వరుణ్‌లవ్’ వెడ్డింగ్‌ పార్టీలో రీతూ వర్మ.. రూమర్స్‌కు వైష్ణవ్ చెక్

****************************

*CWC23Final: మహేష్ బాబు ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లాలంటూ మీమ్స్.. ఎందుకంటే?

*******************************

*Raghava Lawrence: రజనీ రూపంలో రాఘవేంద్రుడిని చూశా..

*******************************

Updated Date - 2023-11-19T15:50:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!