సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Brahmastra 2: రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన డైరెక్టర్

ABN, First Publish Date - 2023-04-01T16:37:17+05:30

రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) హీరో, హీరోయిన్‌గా నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). మొదటి భాగం ‘బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ’ (Brahmastra Part One: Shiva) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) హీరో, హీరోయిన్‌గా నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). మొదటి భాగం ‘బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ’ (Brahmastra Part One: Shiva) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్, అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించారు. ఈ మూవీ పాన్ ఇండియాగా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల అయింది. ఇండియాలో ఈ సినిమా రూ.258కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. 2022లో అత్యధిక కలెక్షన్స్‌ను కొల్లగొట్టిన మూవీగా రికార్డు సృష్టించింది. అయాన్ ముఖర్జీ తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆసక్తికర కబుర్లను ప్రేక్షకులతో పంచుకున్నారు.

‘‘.. ‘బ్రహ్మాస్త్ర 2’ (Brahmastra 2), ‘బ్రహ్మాస్త్ర 3’ షూటింగ్స్‌ను ఒకేసారి చేపడతాం. తర్వాత రాబోయే భాగాలపై భారీ బజ్ ఉంది. అందువల్ల స్క్రిఫ్ట్‌ను రాయడానికే చాలా సమయాన్ని వెచ్చిస్తున్నాం. ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదని నిర్ణయించున్నాం. ‘బ్రహాస్త్ర 2’ 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ రియాక్షన్స్ వచ్చినప్పటికీ మూవీకి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. ప్రజలు మా చిత్రాన్ని బాగా ఆదరించారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోను సక్సెస్ అయింది. 2022లో అత్యధిక కలెక్షన్స్‌ను కొల్లగొట్టిన హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ నే. అయినప్పటికీ విమర్శలను నేను విన్నాను. కొన్ని విషయాల్లో వాటిని అంగీకరిస్తాను. స్క్రిఫ్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని భారీ స్థాయిలో తెరకెక్కించాలనుకుంటున్నాను’’ అని అయాన్ ముఖర్జీ తెలిపారు.

‘బ్రహ్మాస్త్ర’ ను ధర్మ ప్రొడక్షన్స్‌తో కలసి ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ప్రైమ్ ఫోకస్ నిర్మించాయి. ఈ చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్‌ఎస్. రాజమౌళి (SS Rajamouli) తెలుగులో సమర్పించారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Pushpa: The Rule: డిజిటల్ రైట్స్ కోసం పోటీపడుతున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్!

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Updated Date - 2023-04-01T16:44:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!