Shah Rukh Khan: ఆస్తి విలువలో టామ్ క్రూజ్‌ను బీట్ చేసిన షారూఖ్.. అత్యంత ధనవంత నటుల లిస్ట్‌లో..
ABN, First Publish Date - 2023-01-16T17:54:32+05:30
నాలుగేళ్లుగా ఏ చిత్రం చేయనప్పటికీ కింగ్ ఖాన్ మాత్రం ప్రపంచ ధనవంత నటుల లిస్ట్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. హాలీవుడ్ నటులు టామ్ క్రూజ్ (Tom Cruise), జార్జ్ క్లూనీ (George Clooney)లను బీట్ చేసి ఈ స్థానం దక్కించుకోవడం చెప్పుకోదగ్గ విశేషం.
బాలీవుడ్ స్టార్ హీరోల్లో షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఒకరు. మూడు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. చివరి సినిమా జీరో (Zero) పరాజయం పాలవ్వడంతో నటనకు కొంత కాలం విరామిచ్చాడు. కానీ, కొన్ని చిత్రాల్లో మాత్రం అతిథి పాత్రలు పోషించాడు. ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’, ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 1: శివ’ లో గెస్ట్ రోల్స్‌లో కనిపించాడు. నాలుగేళ్లుగా ఏ చిత్రం చేయనప్పటికీ కింగ్ ఖాన్ మాత్రం ప్రపంచ ధనవంత నటుల లిస్ట్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. హాలీవుడ్ నటులు టామ్ క్రూజ్ (Tom Cruise), జార్జ్ క్లూనీ (George Clooney)లను బీట్ చేసి ఈ స్థానం దక్కించుకోవడం చెప్పుకోదగ్గ విశేషం.
వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ధనవంత నటుల లిస్ట్‌ను ప్రచురించింది. ఈ జాబితాలో షారూఖ్ ఖాన్ నాలుగో స్థానంలో నిలిచాడు. 770మిలియన్ డాలర్స్ ఆస్తి విలువతో జాకీ చాన్, రాబర్ట్ డి నిరోలను బీట్ చేశాడు.ఈ లిస్ట్‌లో 1బిలియన్ డాలర్స్ ఆస్తితో జెర్రీ సీన్ ఫీల్డ్ మొదటి స్థానంలో నిలిచాడు. టేలర్ పెర్రీ రెండో స్థానంలో, డ్వేన్ జాన్సన్ మూడో స్థానంలో ఉన్నారు. టామ్ క్రూజ్ 620మిలియన్ డాలర్స్, జాకీ చాన్ 520మిలియన్ డాలర్స్‌తో షారూఖ్ తర్వాతి స్థానాలైన ఐదు, ఆరును దక్కించుకున్నారు. ఇక షారూఖ్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా పఠాన్ (Pathaan) లో నటించాడు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించింది. ఆదిత్య చోప్రా నిర్మించాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 25న విడుదల కానుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.