సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ranbir Kapoor: అభిమాని ఫోన్‌ను విసిరేసిన రణ్‌బీర్.. వైరల్‌గా మారిన వీడియో..

ABN, First Publish Date - 2023-01-27T19:54:10+05:30

బాలీవుడ్‌లోని టాలెంటెడ్ నటుల్లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఒకరు. చివరగా ‘షంషేరా’ (Shamshera) లో నటించాడు. రణ్‌బీర్ తాజాగా ఓ అభిమాని ఫోన్‌ను విసిరేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లోని టాలెంటెడ్ నటుల్లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఒకరు. చివరగా ‘షంషేరా’ (Shamshera) లో నటించాడు. రణ్‌బీర్ తాజాగా ఓ అభిమాని ఫోన్‌ను విసిరేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఫలితంగా నెటిజన్స్ అందరు రణ్‌బీర్‌‌ను ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ పని మీద బయటికి వచ్చాడు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్స్ అతడిని క్లిక్‌ మనిపించారు. హీరోతో సెల్ఫీలు తీసుకోవడానికి అభిమానులు ఎగబడ్డారు. రణ్‌బీర్ కూడా నవ్వూతూ ఓ అభిమానితో సెల్ఫీకి ఫోజు ఇచ్చాడు. అయితే, ఆ అభిమాని చాలా సార్లు సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించినప్పటికి సఫలం కాలేదు. దీంతో రణ్‌బీర్ కోపానికి గురయ్యాడు. అతడి ఫోన్‌ను తీసుకుని వెనుకకు విసిరాడు. ఈ సమయంలో రణ్‌బీర్ సిబ్బంది ఈ ఘటనను రికార్డు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ, కొంత మంది మాత్రం రికార్డ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో కింద నెటిజన్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ‘‘సెల్ఫీ ఇవ్వడానికి ఇంత యాటిట్యూడా’’ అని ఓ నెటిజన్ కామెంట్ పోస్ట్ చేశారు. కొంత మంది మాత్రం ఇది యాడ్ క్యాంపెయిన్ అని చెబుతున్నారు. ఓ ఫోన్ కంపెనీ ప్రమోషన్ కోసం చేసిన స్టంట్ అని కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - 2023-01-28T14:48:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!