సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kapil Sharma: రామ్ చరణ్, తారక్‌పై ప్రశంసల వర్షం

ABN, First Publish Date - 2023-03-19T19:28:57+05:30

బాలీవుడ్‌లోని ఫేమస్ కమెడియన్స్‌లో కపిల్ శర్మ (Kapil Sharma) ఒకరు. కామెడీ షోలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కపిల్ అనేక బాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లోని ఫేమస్ కమెడియన్స్‌లో కపిల్ శర్మ (Kapil Sharma) ఒకరు. కామెడీ షోలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కపిల్ అనేక బాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ‘ఫిరంగీ’, ‘సన్ ఆఫ్ మంజీత్ సింగ్’, ‘ఇట్స్ మై లైఫ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. తాజాగా ‘జ్విగటో’ (Zwigato) తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి నందితా దాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన హైదరాబాద్‌కు విచ్చేశారు. ఆసక్తికర కబుర్లను ప్రేక్షకులతో పంచుకున్నారు.

గతంలో ఎన్నో సార్లు హైదరాబాద్‌కు వచ్చానని కపిల్ శర్మ తెలిపారు. ‘‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) యాంకరింగ్ కోసం గతంలో హైదరాబాద్‌కు వచ్చాను. నేను ప్రతిసారి ఇక్కడకు వచ్చినప్పుడు సానియా మీర్జా నాకు బిర్యానీ పంపించేది. జ్విగటో సినిమా కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. ఆహారాన్ని సమయానికి డెలివరీ చేయాల్సిన ఒక్క వ్యక్తి ఎదుర్కొన్న ఇబ్బందులను చిత్రంలో చూపించాం. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు నా శుభాకాంక్షలు. వారిని చూసి నేను గర్విస్తున్నాను. రామ్ చరణ్ (Ramcharan), జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR) ను గతంలో నేను కలిశాను. మేం ముగ్గురం కలుసుకున్నప్పుడు ఒకరి మీద మరొకరం జోక్స్ వేసుకుని నవ్వుకున్నాం. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ప్రత్యేకంగా నన్ను కలుసుకోవడానికే ఒకసారి వచ్చారు. అప్పుడు చాలా సంతోషమేసింది’’ అని కపిల్ శర్మ తెలిపారు.


^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా

Oscars 2023: షాక్.. ఆస్కార్ వేడుకకు ఫ్రీ పాస్‌లు లేకపోవడంతో.. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ భారీ ఖర్చు..

RRR: రామ్ చరణ్, తారక్ అందువల్లే ఆస్కార్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయలేదు!

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Pawan Kalyan: నా రెమ్యునరేషన్ రోజుకు రెండు కోట్లు

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Updated Date - 2023-03-19T19:49:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!