కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sara Ali Khan: సారా అలీఖాన్ కోరిక ఏంటో తెలుసా?

ABN, Publish Date - Dec 20 , 2023 | 09:26 AM

పటౌడీ ప్రిన్సెస్‌, బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ కూతురు సారా అలీఖాన్‌. బాలీవుడ్‌ నేపథ్యం, అందునా బలమైన మూలాలున్న కుటుంబం నుంచి వచ్చిన సారా ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. సారా తన తాజా ఇంటర్వ్యూలో.. తనకు ప్రతిభ ఉన్న దర్శకులతో పని చేయాలని ఉందంటూ.. మనసులోని మాటలను బయటపెట్టింది.

Sara Ali Khan

బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) కూతురు సారా అలీఖాన్‌ (Sara Ali Khan). బాలీవుడ్‌ నేపథ్యం, అందునా బలమైన మూలాలున్న కుటుంబం నుంచి వచ్చిన సారా సినిమా విశేషాలు, కొన్ని జీవిత విషయాల విషయానికి వస్తే.. ఇన్‌స్టాలో సారా అలీఖాన్‌ను నాలుగున్నర కోట్ల వరకు ఫాలో అవుతున్నారు. ఈ సంఖ్య చాలు.. ప్రస్తుతం బాలీవుడ్‌ కథానాయికల్లో ఆమె స్థానం పదిలమని. ఈ పటౌడీ ప్రిన్సెస్‌ సినిమా విశేషాలతో పాటు కుటుంబం, బ్రాండ్స్‌, పర్సనల్‌ లైఫ్‌, చిన్నప్పటి ఫొటోలు.. షేర్‌ చేస్తూంటుంది. సినిమా కథానాయికగా పక్కనబెడితే.. ఆమె సింప్లిసిటీకి, నిగర్వితనం మాటలకే ఎక్కువ మంది ఫిదా అవుతారు. అందుకే సారా.. ఇపుడు యువతలో సెన్షేషనల్‌ హీరోయిన్‌.

అంత సులువు కాదు..

ఒకప్పుడు సారా అలీఖాన్‌ బొద్దుగా ఉండేది. 2016లో కొలంబియా యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకుంది. చదువులపై ఆసక్తి ఉండే ఆమె.. తన నేపథ్యం వల్ల ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలనుకుంది. బొద్దుగా ఉంటే కుదరదని కసరత్తులు చేసింది. కథానాయికగా 2018లో పరిచయమైంది బాలీవుడ్‌ తెరకు. సినిమా పేరు ‘కేదరనాథ్‌’. ముక్కు పాత్రకు మంచి పేరొచ్చింది. అంతేనా.. బెస్ట్‌ డెబ్యూట్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకుంది. ‘సైఫ్‌ అలీఖాన్‌ కూతురు. పటౌడీ ఫ్యామిలీ.. అని సినిమాలు చూడరు. పాత్రలో బాగా నటిస్తేనే జనాలు చూస్తార’ని తెలిసింది. కొన్ని చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద వర్కవుట్‌ కాలేదు. ఇక్కడ పని చేయకపోతే.. ఎవరూ నిలదొక్కుకోలేరు. ఆ మాటకొస్తే.. నటిగా ప్రూవ్‌ చేసుకోవటం అంత సులువు కాదు! (Sara Ali Khan Interview)


నా జీవితంలో అదో పాఠం..

‘సింబా’, ‘లవ్‌ ఆజ్‌ కల్‌’ ‘కూలీ నంబర్‌ వన్‌’ తర్వాత ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో ఆమె ‘అత్రాంగి రే’ చిత్రంలో నటించింది. ‘ఈ చిత్రంలో పాత్ర పేరు రింకు. అచ్చు రింకులానే ఫీలవ్వు’ అనే వారు దర్శకుడు ఆనంద్‌. ఎలా నటించాలో తెలిసొచ్చింది ఈ చిత్రంతో. అదో పాఠం. దర్శకుడు ఆనంద్‌గారి ప్రతిభ అది. ‘నా దృష్టిలో కథే కింగ్‌. మంచి స్ర్కిప్టులు వస్తేనే మేము ఉండేది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతిభ ఉన్న దర్శకులతో పని చేయాలన్నదే ఆశ. అలాంటప్పుడు మనలోని ప్రతిభ బయట పడుతుంది. అందుకే మంచి కథలకే ఓటేస్తా’ అంటుంది సారా.

అమ్మే నా మెంటర్‌..

‘మా అమ్మ అమృతాసింగ్‌ నా బెస్ట్‌ ఫ్రెండ్‌. మెంటర్‌. గైడెన్స్‌ ఇచ్చేది తనే. నేను చేసే సినిమాల్లో హెయిర్‌ స్టయిల్‌ దగ్గరనుంచి అమ్మతో చర్చిస్తా. తన సలహా చెబుతుంది. అమ్మతో పాటు నాన్నంటే చాలా ఇష్టం. అందరం కలిసి ఉండకపోవచ్చు కానీ నాన్న ఆ లోటు తేలెదెన్నడూ. నాన్న నాతో రాజకీయాలు, సినిమా, కల్చర్‌, ఆర్ట్‌ గురించి మాట్లాడతారు. ఇక నా తమ్ముడు ఇబ్రహీం గురించి చెప్పాల్సిందే. ఇద్దరు గొడవపడతాం. నేను మంచి సినిమాలు ఎంచుకోకపోతే క్లాస్‌ తీసుకుంటాడు. నేను అక్కనే కానీ.. నన్ను మాత్రం చెల్లెలిలా చూసుకుంటాడు. సలహాలిస్తాడు. తనకు సపోర్టు కావాలన్నప్పుడే నేను పెద్దదాన్ని కదా! అనుకుంటానంతే. ‘మా చిన్న తమ్ముళ్లు తైమూర్‌, జహంగీర్‌ అన్నా ఇష్టమే. నాన్నకు ఏది ఇష్టమైతే నాకూ అదే ఇష్టం. క్యూట్ కిడ్స్‌తో గడపటం ఎంతో హ్యాపీ’ అంటుంది.

అలా ఐడెంటిటీ...

కామెడీ, క్రైమ్‌, మసాలా మూవీ, చారిత్రక గాథలు.. ఇలా విభిన్నమైన చిత్రాల్లో నటించటం తనకెంతో ఇష్టమంటుంది సారా. ఇలా నటిస్తే రొటీన్‌గా ఫీలవ్వమంటుంది. ‘సోమరిగా ఉంటాను.. అయితే వర్కవుట్స్‌ విషయంలో అలా ఉండను. ఎప్పుడూ డుంబా కొట్టను. హీరోయిన్‌గా ఫిజిక్‌ను కాపాడుకుంటేనే కదా?’ అంటుంది సారా అలీఖాన్‌. ఆమె మీద అమ్మమ్మ, నాన్నమ్మల ప్రభావం ఉంది. వారిలా స్ట్రాంగ్ అనిపించుకోవాలంటుంది. ఒకప్పుడు ఇబ్రహీం అక్కగా, ఆ తర్వాత కొలంబియా యూనివర్శిటీ విద్యార్థిగా.. ఇప్పుడు నటిగా ఐడెంటిటీ పొందుతాను. ఏదేమైనా మహిళా ప్రాధాన్యం ఉండే చిత్రాల్లో ప్రూవ్‌ చేసుకోవాలి. మంచి కథలను ఎంచుకునే కథానాయికగా గుర్తింపు పొందాలంటుంది సారా అలీఖాన్‌.


ఇవి కూడా చదవండి:

====================

*We Love Bad Boys: సెన్సార్ పూర్తి చేసుకున్న కడుపుబ్బే కామెడీ ఎంటర్‌టైనర్‌‌

*************************************

*Bigg Boss Telugu 7 Winner: ‘BB’నే విన్నర్.. టాప్ 2, 3 స్థానాలకే వారు పరిమితం

*******************************

Updated Date - Dec 20 , 2023 | 09:27 AM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!