Bobby Deol: రానా నాయుడు నాకు నచ్చలేదు, సంచలన కామెంట్స్ చేసిన బాబీ డియోల్
ABN, First Publish Date - 2023-10-30T16:16:38+05:30
ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కి వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్ నచ్చలేదు అని చెప్పేసాడు. ముఖ్య పాత్రలో తనని తీసుకోకపోవటంతో బాధపడ్డాను అని, అయితే హిందీ వెబ్ సిరీస్ చూసాక సరిగ్గా తీయలేదు అని తన మనసులో మాట చెప్పేసాడు బాబీ డియోల్
బాబీ డియోల్ (BobbyDeol) 'యానిమల్' #Animal సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. 'యానిమల్' ట్రైలర్ చూస్తే కనక అందులో చివర్లో కొన్ని సెకండ్స్ పాటు మాత్రమే బాబీ డియోల్ కనపడతాడు, కానీ అతని పాత్ర ఆ సినిమాలో ఎంత ముఖ్యమైందో ఆ ఒక్క సన్నివేశంతో తెలిసిపోతుంది. సందీప్ రెడ్డి వంగా (SandeepReddyVanga) దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ (RanbirKapoor), అనిల్ కపూర్ (AnilKapoor), రష్మిక మందన్న (RashmikaMandanna) నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో విడుదలకి సిద్ధం అవుతోంది.
ఇదిలా ఉండగా, బాబీ డియోల్ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనకి నచ్చిన, చేసిన పాత్రల గురించి మాట్లాడుతూ, 'రానానాయుడు' #RanaNaidu లో తనని తీసుకోకపోవటం చాలా బాధకలిగించింది అని చెప్పాడు. నెట్ ఫ్లిక్స్ (NetFlix) లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో వెంకటేష్ దగ్గుబాటి (VenkateshDaggubati), రానా దగ్గుబాటి (RanaDaggubati), సుచిత్ర పిళ్ళై (SuchitraPillai), గౌరవ్ చోప్రా (GauravChopra) నటించగా, ఇందులో శృంగారం ఎక్కువయింది అన్న విమర్శలు కూడా వచ్చాయి.
ఈ వెబ్ సిరీస్ 'రే డొనోవన్' #RayDonovan అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కి రీమేక్ గా తీసాడు. "నేను 'రే డొనోవన్' చూసాను, అందులో ఆ పాత్ర వెయ్యడానికి నేను సిద్ధమే, కానీ నన్ను తీసుకోకపోవటం చాలా బాధ కలిగించింది. 'రానా నాయుడు' వెబ్ సిరీస్ కూడా చూసాను, అది ఒక మంచి కథ, మంచి పాత్రలు అన్నీ అందులో వున్నాయి, కానీ దాన్ని సరిగ్గా తీయలేకపోయారు. నాకు 'రానా నాయుడు' నచ్చలేదు, అది చూసి చాలా అప్సెట్ అయ్యాను," అని చెప్పాడు బాబీ డియోల్.
'రానా నాయుడు' వెబ్ సిరీస్ ని కరన్ అన్షుమాన్, (KaranAnshuman) సుపర్ణ వర్మ (SuparnVerma) దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ కూడా వస్తుంది అని ఈమధ్యనే వెంకటేష్ ఒక మీడియా సమావేశంలో చెప్పారు.