కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bipasha Basu: పుట్టిన మూడో రోజే ఆ విషయం తెల్సింది 

ABN, First Publish Date - 2023-08-06T16:35:22+05:30

బిపాసా బసు (Bipasha Basu) పరిచయం అక్కర్లేని బాలీవుడ్‌ నటి. బ్లాక్‌ హాట్‌ బ్యూటీగా గుర్తింపు పొందిన ఆమె కొంతకాలంగా సినిమాలకు దూరమయ్యారు. చాలాకాలంగా సినిమాలకు, మీడియాకు దూరంగా ఉంటున్న బిపాసా తన పాప ఆరోగ్య విషయంలో కన్నీటి పర్యాంతమయ్యారు. తాజాగా ఇచ్చిన వెబినార్‌కు సంబంధించిన వీడియోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. 

బిపాసా బసు (Bipasha Basu) పరిచయం అక్కర్లేని బాలీవుడ్‌ నటి. బ్లాక్‌ హాట్‌ బ్యూటీగా గుర్తింపు పొందిన ఆమె కొంతకాలంగా సినిమాలకు దూరమయ్యారు. 2014లో ‘ఎలోన్‌’ చిత్రం షూటింగ్‌లో సహనటుడు కరణ్‌సింగ్‌ గ్రోవర్‌తో ప్రేమలో పడ్డారు బిపాసా. 2016లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2022 నవంబర్‌లో ఈ జంట దేవి (Heart Disease) అనే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. చాలాకాలంగా సినిమాలకు, మీడియాకు దూరంగా ఉంటున్న బిపాసా తన పాప ఆరోగ్య విషయంలో కన్నీటి పర్యాంతమయ్యారు. తాజాగా ఇచ్చిన వెబినార్‌కు సంబంధించిన వీడియోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. పాప గుండెలో రంథ్రాలు ఉన్నాయని చెప్పిన ఆమె మూడు నెలల వయసులో ఆమెకు సర్జరీ చేయించామని తెలిపారు. ఏ తల్లికీ ఇలాంటి పరిస్థితి రాకూడదంటూ బిపాసా భావోద్వేగానికి లోనయ్యారు.

‘‘మా జీవితం అందరి తల్లిదండ్రుల్లా కాదు. నా పాప గుండెలో రంథ్రాలు ఉన్నాయని తను పుట్టిన మూడో రోజే మాకు తెలిసింది. నిజం చెప్పాలంటే వీఎస్‌డీ అంటే ఏంటో కూడా మాకు తెలియదు. క్రమం తప్పకుండా స్కానింగ్స్‌ చేయించాలని వైద్యులు చెప్పారు. తెలిసిన డాక్టర్లతో మాట్లాడితే వీలైనంత త్వరగా సర్జరీ చేయాలన్నారు. దేవి పుట్టిన మూడో నెలలో సర్జరీ చేయించాం. ఆ సమయంలో కరణ్‌ షూటింగ్‌ నిమిత్తం విదేశాల్లో ఉన్నాడు. రావడానికి ప్రయత్నించినా కదరలేదు. ఆ కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం చెప్పలేదు. ఎందుకంటే ఆ సమయంలో ఇంటిల్లిపాదీ వైరల్‌ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంలో నేను ధైర్యంగా ముందుకు అడుగు వేశాను. దూరంగా ఉన్న కరణ్‌ ఎంతో కంగారు పడ్డారు. ఆరు గంటలపాటు వైద్యులు సర్జరీ చేసి.. దేవిని కాపాడారు. ఆ రోజులను నేను ఎప్పటికీ మర్చిపోను. సర్జరీ తర్వాత 40 రాత్రులు నిద్ర లేకుండా గడిపాను. అసలు ఏం జరుగుతోందో, ఎలా ఉంటుందో అని ప్రతి క్షణం పాపను కనిపెట్టుకుంటూనే ఉన్నా. కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఇప్పుడు తను ఆరోగ్యంగా ఉంది. దేవి ఆరోగ్య పరిస్థితి గురించి నేను ఎవరితోనూ చెప్పకూడదనుకున్నా. ఏ తల్లికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఈ ప్రయాణంలో నాకు ఎంతోమంది తల్లులు సాయం చేశారు. వారందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటా’’ అని బిపాసా అన్నారు.

Updated Date - 2023-08-06T16:35:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!