సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bhumi Pednekar: ఫోటోలు చూసారా, వైరల్ అయ్యాయి

ABN, First Publish Date - 2023-02-14T17:50:36+05:30

హిందీ సినిమాల్లో ఒక బలమయిన ఫిమేల్ పాత్రలు పోషిస్తున్న నటీమణుల్లో భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar) ఒకరు. ఆమె ఇప్పుడు వున్న నటీమణుల్లో ఒక మంచి నటి అని అనిపించుకున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందీ సినిమాల్లో ఒక బలమయిన ఫిమేల్ పాత్రలు పోషిస్తున్న నటీమణుల్లో భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar) ఒకరు. ఆమె ఇప్పుడు వున్న నటీమణుల్లో ఒక మంచి నటి అని అనిపించుకున్నారు. మొదటి సినిమా నుండే ఆమె అవార్డులు రివార్డులు అందుకున్నారు. 2015 సంవత్సరం లో 'దమ్ లగాకే హైష' (Dum Laga Ke Haisha) అనే హిందీ సినిమా ద్వారా నటిగా పరిచయం అయ్యారు భూమి పెడ్నేకర్.

మొదటి సినిమా లో ఆమె పోషించిన సంధ్య పాత్రకు గాని ఆమె 12 కిలోల బరువు పెరిగారు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆమె నటనని ప్రశంసించకుండా ఉండలేకపోయారు, అంతా బాగా చేసింది. అందుకే ఆమెకి ఫిలింఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డు కూడా వరించింది. (Filmfare Best Female Debut actress)

ఇంక మొదటి సినిమా నే అంత పేరు సంపాదిస్తే, అవకాశాలు రాకుండా ఉంటాయా, వెంటనే వచ్చాయి. ఆ సినిమా పెద్ద విజయం సాధించటమే కాకుండా జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. తరువాత భూమి యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఒక మినీ వెబ్ సిరీస్ లో నటించింది.

రెండేళ్ల తరువాత అక్షయ్ కుమార్ (Akshay Kumar) పక్కన నటించే అవకాశం కొట్టేసింది భూమి. 'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ' (Toilet: Ek Prem Katha) అనే సినిమాలో ఒక ధీరోదాత్తమయిన మహిళా పాత్ర పోషించింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద విజయం సాధించి భూమి పెడ్నేకర్ కి మంచి పేరు తీసుకు వచ్చింది.

అక్కడ నుండి హిందీ సినిమాల్లో ఒక ప్రోగ్రెసివ్ అమ్మాయి పాత్ర వేయాలంటే భూమి పెడ్నేకర్ అనేట్టుగా సినిమాల్లో ఆమెకి అవకాశాలు వచ్చాయి. ఈమధ్యనే 'గోవిందా మేర నామ్' (Govinda Mera Naam) అనే సినిమా కూడా వచ్చింది. ఇందులో వికీ కౌశల్ (Vicky Kaushal), కియారా అద్వానీ (Kiara Advani) కూడా వున్నారు. ఇది డైరెక్ట్ గా డిస్నీ+హాట్ స్టార్ లో విడుదల అయింది.

ఇప్పుడు భూమి చేతిలో చాలా సినిమాలే వున్నాయి. నటుడు రాజ్ కుమార్ రావు (Rajkumar Rao) పక్కన ఒక మూవీ చేస్తోంది. అలాగే 'భక్షక్' అనే సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతోంది. అలాగే అర్జున్ కపూర్ (Arjun Kapoor) పక్కన రెండు సినిమాలు చేస్తోంది, అవి షూటింగ్ లో వున్నాయి. ఇంకా నవాజుద్దీన్ సిద్ధికి (Nawazuddin Siddiqui) తో కూడా ఒక సినిమా చేస్తోంది.

మొన్నీమధ్య జరిగిన కియారా అద్వానీ సిద్ధార్థ్ మల్హోత్రా లు వివాహం (#SidKiara) తరువాత ఇచ్చిన రిసెప్షన్ కి భూమి వెళ్ళింది. #SidKiaraReception అప్పుడు తరుణ్ తహిలియాని (Tarun Tahiliani) డ్రెస్ వేసుకొని వెళ్లి అందరికీ పోజులు #SidKiaraKiShaadi ఇచ్చిన ఫోటోస్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఆమె ఆ ఫోటోస్ లో చాల గ్లామర్ గా కనపడటమే విశేషం.

Updated Date - 2023-02-14T17:50:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!