Bholaa Shankar: హిందీలో కూడా విడుదల చేస్తున్నారు, అసలు ఇది కదా ట్విస్ట్ అంటే
ABN, First Publish Date - 2023-08-15T12:13:22+05:30
చిరంజీవి నటించిన 'భోళాశంకర్' తెలుగులో ఎటువంటి ఆదరణ పొందింది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ సినిమాని హిందీలో విడుదల చెయ్యడం, హిందీలో చిరంజీవికి ఒక ప్రముఖ నటుడు తన వాయిస్ ఇవ్వడం
చిరంజీవి (Chiranjeevi) నటించిన 'భోళాశంకర్' #BholaaShankar తెలుగులో ఆగస్టు 11న విడుదలైంది. దీనికి మెహెర్ రమేష్ (MeherRamesh) దర్శకుడు, అనిల్ సుంకర (AnilSunkara) నిర్మాత. తమన్నా (TamannaahBhatia) కథానాయికగా నటించగా, కీర్తి సురేష్ (KeerthySuresh) ఇందులో చిరంజీవి చెల్లెలుగా చేసింది. ఇది తమిళ సినిమా 'వేదాళం' (Vedalam) కి రీమేక్, తమిళ సినిమాలో అజిత్ (AjithKumar) కథానాయకుడు, శివ దర్శకుడు. ఈ సినిమా తెలుగులో విడుదలై చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. చిరంజీవి అభిమానులు సైతం ఈ సినిమాని నచ్చకపోవటం విశేషం కాగా, చిరంజీవిని రీమేక్ లు చెయ్యొద్దు అని బతిమాలుకుంటున్నారు సాంఘీక మాధ్యమాల్లో.
పది సంవత్సరాల తరువాత దర్శకుడు మెహెర్ రమేష్ కి, చిరంజీవి పిలిచి ఛాన్స్ ఇస్తే అతను 'భోళాశంకర్' అనే సినిమాకి బదులు జబర్దస్త్ నటులతో స్కిట్స్ చేసాడు అనే విమర్శలు ఎక్కడపడితే అక్కడ వినపడుతున్నాయి. అంటే అంత ఘోరంగా మెహెర్ ఈ సినిమాని చూపించాడు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సినిమా ఇప్పుడు హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. ఆగష్టు 25న విడుదల అవుతోంది అని ఆర్కెడీ స్టూడియో #RKDStudios వాళ్ళు ప్రకటించడమే కాకుండా, ఈ సినిమా టీజర్ ని కూడా విడుదల చేశారు. ఇంకో ఆసక్తికర విషయం హిందీలో చిరంజీవి అక్కడ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ (JackieShroff) డబ్బింగ్ చెప్పడం. ఇలా ఇన్ని ట్విస్ట్స్ తో ఈ సినిమా హిందీలో కూడా విడుదలవుతోంది. అయితే ఈ హిందీ విడుదల విషయంలో తెలుగు నిర్మాత కానీ, దర్శకుడు కానీ ఎటువంటి పోస్ట్స్ తమ సాంఘికా మాధ్యమాల్లో పెట్టకపోవడం ఇంకో ఆశ్చర్యం.