Pathaan controversy: ముదురుతున్న వివాదం.. మాల్లో పోస్టర్లు ధ్వంసం చేసిన భజరంగ్‌దళ్
ABN, First Publish Date - 2023-01-05T10:31:01+05:30
గత కొన్ని రోజులుగా బాలీవుడ్ సినీ నటులు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), దీపికా పదుకొనే (Deepika Padukone) నటించిన ‘పఠాన్’ (Pathaan)పై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.
గత కొన్ని రోజులుగా బాలీవుడ్ సినీ నటులు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), దీపికా పదుకొనే (Deepika Padukone) నటించిన ‘పఠాన్’ (Pathaan)పై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్‌పై హిందూ గ్రూప్ భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భజరంగ్‌దళ్ కార్యకర్తలు బుధవారం అహ్మదాబాద్‌లోని ఒక మాల్‌ను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అందులో.. జనవరి 25న విడుదల కానున్న ‘పఠాన్’ సినిమా పోస్టర్లను కార్యకర్తలు చించివేశారు. అలాగే సినిమా విడుదలకు ముందు హిందూ భజరంగ్ దళ్ గుజరాత్ గ్రూపు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అలాగే.. సినిమా పోస్టర్లను చించివేయడమే కాకుండా, థియేటర్లలో పఠాన్ సినిమాను విడుదల చేయవద్దని వారు హెచ్చరించారు.
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే,జాన్ అబ్రహం నటించిన ‘పఠాన్’ చిత్రం బేషరమ్ రంగ్ పాట విడుదలైనప్పటి నుంచి పలు వివాదాలు రాజుకున్నాయి. షారుఖ్ ఖాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు పఠాన్ సినిమాను నిషేధించాలని హిందూ గ్రూప్ కార్యకర్తలు పిలుపునిచ్చారు.