Anurag Kashyap: ‘కెన్నెడీ’ సినిమా వెనకున్న కథేంటి?
ABN, First Publish Date - 2023-05-22T15:52:30+05:30
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్(Anurah Kashyap) 76వ కేన్స్ ఫిల్మ్ (CanesFilm Festival)ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. తన తాజా చిత్రం ‘కెన్నెడీ’ (Kennedy) చిత్రాన్ని కేన్స్‌లో ప్రదర్శించనున్నారు.
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్(Anurah Kashyap) 76వ కేన్స్ ఫిల్మ్ (Cannes 2023)ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. తన తాజా చిత్రం ‘కెన్నెడీ’ (Kennedy) చిత్రాన్ని కేన్స్‌లో ప్రదర్శించనున్నారు. రాహుల్ భట్, సన్నీలియోన్ కీలక పాత్రధారులు నటించిన ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను అక్కడి మీడియాతో పంచుకున్నారు. దక్షిణాది నటుడు చియాన్ విక్రమ్(Chiyaan Vikram First choice) ను దృష్టిలో ఉంచుకుని ఈ కథ రాసుకున్నట్లు చెప్పారు. విక్రమ్‌కు బదులుగా రాహుల్‌తో సినిమా చేయడానికి కారణాన్ని తెలిపారు అనురాగ్. (Cannes Film Festival 2023 )
‘‘ఈ కథను రాస్తున్నప్పుడు నా మదిలో విక్రమ్ మాత్రమే ఉన్నారు. ఆయన్ని దృష్టిలో ఉంచుకునే ఈ కథను సిద్థం చేశాను. విక్రమ్ అసలు పేరు కెన్నెడీ. అందుకే ఈ ప్రాజెక్ట్‌కు ‘కెన్నెడీ’ అనే పేరు పెట్టాను. కథ పూర్తయ్యాక విక్రమ్‌ను కలిసి స్టోరీ లైన్ చెప్పాను. కానీ, ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అలా, ఓసారి నేను రాహుల్ భట్‌ను కలిసి కథ ఆయన చేతికి ఇచ్చాను. కథ చదువుతున్న సేపు ఆయన కనబరిచిన ఆసక్తి నాకెంతో ఆసక్తికరంగా అనిపించింది. ‘ఇందులో ఎవరు నటిస్తున్నారు?’’ అని ఆయన నన్ను అడిగారు. ‘మీకు ఓకే అంటే ఈ సినిమాలో మీరే ప్రధాన పాత్ర చేయవచ్చు. కాకపోతే దీని కోసం మీరు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది’’ అని చెప్పాను. దాదాపు ఎనిమిది నెలలపాటు అన్నీ సినిమాలను పక్కనపెట్టేసి దీని కోసం ఆయన వర్క్ చేశారు’’ అని అనురాగ్ చెప్పారు.