Breaking News: ప్రముఖ దర్శక నటుడు మృతి.. షాక్‌లో బాలీవుడ్..
ABN, First Publish Date - 2023-03-09T09:19:16+05:30
హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు సతీష్ కౌశిష్ (Satish Kaushik) కన్నుమూశారు.
హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు సతీష్ కౌశిష్ (Satish Kaushik) కన్నుమూశారు. 66 ఏళ్ల వయస్సులో గురువారం (మార్చి 9న) ఉదయం గుండెపోటు కారణంగా ఆయన కన్నుమూశారు. ఈ విషాద సంఘటనని తెలుపుతూ ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఫేమ్ అనుపమ్ ఖేర్ (Anupam Kher) సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ని షేర్ చేశారు. దీంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
అనుపమ్ షేర్ చేసిన పోస్టులో.. ‘చావే చివరి గమ్యం అని నాకు తెలుసు. కానీ నా ప్రియ మిత్రుడి గురించి ఇలా రాయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. 45 ఏళ్ల స్నేహం చివరికి ఇలా ముగియడం విచారకరం. నువ్వు లేకుండా జీవితం ఇక ఎప్పటికీ గతంలా ఉండదు. ఓం శాంతి’ అని రాసుకొచ్చారు. అయితే మృతిపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తూ షాకింగ్‌కి గురించేసిందంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు. కంగనా రనౌత్, రవీనా టండన్‌తో పాటు మరికొందరు సతీష్ మరణానికి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. (Satish Kaushik)
హర్యానాలోని ఓ గ్రామంలో 13 ఏప్రిల్ 1956న పుట్టిన సతీష్ కౌశిక్ (Satish Kaushik).. థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడే ఆయనకి అనుపమ్ ఖేర్‌కి స్నేహం కుదిరింది. అనంతరం 1983లో వచ్చిన ‘జానే భీ దో యారోన్’ చిత్రానికి మాటల రచయిత అవకాశం దక్కింది. అలాగే కమెడియన్‌గా, స్క్రీన్ రైటర్‌గా, దర్శక నిర్మాతగానూ ఆయన బాలీవుడ్‌లో రాణించారు. ‘చోరో కా రాజా’, ‘ప్రేమ్’, ‘హమ్ ఆప్‌కే దిల్ మే రహ్‌తే హై’, ‘తేరే సంగ్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.
ఇవి కూడా చదవండి:
OTT Release: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?
Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా
Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి
Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..
Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..