కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Animal Trailer: 24 గంటల్లో 50 మిలియన్లకు పైగా!

ABN, First Publish Date - 2023-11-25T14:34:50+05:30

రణ్‌బీర్‌కపూర్‌ (Ranbir kapoor) , రష్మిక మందన్నా (Rashmika mandanna) జంటగా సందీప్‌రెడ్డి  వంగా దర్శకత్వంలో తెరకెక్కించిన 'యానిమల్‌ (animal) చిత్రం డిసెంబర్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ తరుణంలో మేకర్స్‌ ప్రమోషన్ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.

రణ్‌బీర్‌కపూర్‌ (Ranbir kapoor) , రష్మిక మందన్నా (Rashmika mandanna) జంటగా సందీప్‌రెడ్డి  వంగా దర్శకత్వంలో తెరకెక్కించిన 'యానిమల్‌ (animal) చిత్రం డిసెంబర్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ తరుణంలో మేకర్స్‌ ప్రమోషన్ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. యాక్షన్ ప్యాక్డ్‌ కంటెంట్‌తో, తండ్రీ కొడుకుల బాండింగ్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ సోషల్‌ మీడియాను ఊపేస్తోంది. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతూ రికార్డులు సృష్టిస్తోంది. విడుదల చేసిన 24 గంటల్లో 50 మిలియన్ల వ్యూస్‌తో రికార్డ్‌ సృష్టించింది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌లో విడుదలైన చిత్రాల ట్రైలర్‌లో ఇది వ్యూస్‌ పరంగా 'యానిమల్‌ మూడో స్థానంలో ఉన్నట్టు బాలీవుడ్‌ మీడియా చెబుతోంది.

హిందీలో విడుదలైన ఆదిపురుష్‌ ట్రైలర్‌ 24 గంటల్లో 52.22 మిలియన్ల వ్యూస్‌ సాధించగా, రణబీర్‌ నటించిన 'తూ ఝూఠీ మై మక్కార్‌’ 50.96 మిలియన్లు, తాజాగా విడుదలైన యానియల్‌ ట్రైలర్‌ మొదటి 24 గంటల్లో 50.63 మిలియన్ల వ్యూస్‌ సాధించింది. నిర్మాణ సంస్థకు సంబంధించిన యూట్యూబ్‌ చానల్‌లోపాటు ఇతర మాధ్యమాల్లో, డబ్బింగ్‌ వెర్షన్తో కలిపి మొత్తం ఇప్పటికి 70 మిలియన్ల వ్యూస్‌ సాధించి రికార్డ్‌ సృష్టించింది. ఎమోషన్స్ , ఇంటెన్స్, యాక్షన్ తో మిళితమైన ఈ ట్రైలర్‌ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. రణ్‌బీర్‌ సత్తా ఇదని ఆయన అభిమానులు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. (Animal Trailer tranding)

అర్జున్ రెడ్డి తో పాపులర్‌ అయిన సందీప్‌రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. టీ-సిరీస్‌ బ్యానర్‌, భద్రకాళి పిక్చర్స్‌, సినీ 1 స్టూడియోస్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. డిసెంబర్‌ ఒకటో తేదిన, హిందీతోపాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Updated Date - 2023-11-25T15:23:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!