ANIMAL: యానిమల్‌ను ఆకాశానికెత్తేసిన ‘అల్లు అర్జున్’.. ఆ నటి అయితే!
ABN, First Publish Date - 2023-12-08T16:28:08+05:30
దేశవ్యాప్తంగా యానిమల్ సినిమా సృష్టిస్తున్న రికార్డులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. 2018లో అర్జున్ రెడ్డి చిత్రం విడుదలప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏవిధంగానైతే రచ్చ జరిగిందో ఇప్పుడు అచ్చం అలాగే దేశవ్యాప్తంగా జరుగుతూ అంతటా దీనిపైనే చర్చ నడుస్తున్నది. రోజుకొక్కరు చొప్పున ఒక్క సినీ సెలబ్రిటీ ఈసినిమాను నెత్తికెక్కించు కుంటుండడంతో ఈ చిత్రం మరింతగా ప్రజల్లోకి వెల్లిపోతున్నది. తాజాగా అల్లు అర్జున్ ఈ సినిమాను చూసి ఆకాశానికి ఎత్తేశారు.
దేశవ్యాప్తంగా యానిమల్(Animal) సినిమా సృష్టిస్తున్న రికార్డులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. 2018లో అర్జున్ రెడ్డి చిత్రం విడుదలప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏవిధంగానైతే రచ్చ జరిగిందో ఇప్పుడు అచ్చం అలాగే దేశవ్యాప్తంగా జరుగుతూ అంతటా దీనిపైనే చర్చ నడుస్తున్నది.అంతేగాక బాలీవుడ్‌లో ఏ సినిమాకు జరగని రోజురోజుకు రికార్డు బ్రేక్ కలెక్షన్లు కొల్లగొడుతూ అక్కడి సినీ పండడితులనే ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ముంబైలో ఈ సినిమాను 24 గంటలు నాన్‌స్టాప్‌గా ప్రదర్శిస్తున్నారంటే పరిస్థితి, ప్రేక్షకుల డిమాండ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమాపై అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎన్ని వస్తున్నాయో, ప్రముఖుల నుంచి ప్రశంసలు అదే తరహాలో వస్తుండడంతో సినిమాకు ప్రమోషన్ కూడా అదే రేంజ్‌లో జరుగుతున్నది. రోజుకొక్కరు చొప్పున ఒక్క సినీ సెలబ్రిటీ ఈసినిమాను నెత్తికెక్కించుకుంటుండడంతో ఈ చిత్రం మరింతగా ప్రజల్లోకి వెల్లిపోతున్నది. తాజాగా అల్లు అర్జున్( Allu Arjun) ఈ సినిమాను చూసి ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. ఆయన సినిమా గురించి, అందులోని నటుల గురించి ఏమన్నారో ఆయన మాటల్లోనే..
‘యానిమల్ సినిమా మైంఢ్ బ్లోయింగ్‌గా ఉంది, ఆ బ్రిలియెన్స్‌కి మతి పోయింది, రణబీర్ కపూర్(Ranbir Kapoor) తన నటనతో భారతీయ సినిమాను సరి కొత్త స్థాయికి తీసుకెళ్లారని, అసలు వర్ణించడానికి మాటలు రావడం లేదని, ఆయన నటనతో స్ఫూర్తిదాయకంగా ఉంటారని ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా అన్నారు.
అదేవిధంగా ‘రష్మిక తన జీవితంలోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిందని, బాబీ డియోల్, అనీల్ కపూర్‌ల అనుభవం,నటన స్టన్నింగ్‌గా ఉందని ఇందులో వారి నటన గురించి చెప్పడానికి మాటలు కూడా లేవని అన్నారు. ఇక నటి ట్రిప్టీ డిమ్రీ హృదయాలను కొల్లకొట్టిందని మున్ముందు యువకుల మనసును మరింతగా విచ్ఛిన్నం చేయవచ్చు‘ అంటూ అందులోని నటీనటులను ప్రశంసలతో ముంచెత్తారు.
చివరగా యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) గురించి మాట్లాడుతూ.. ‘సందీప్ జస్ట్ మైండ్‌బ్లోయింగ్ చేశాడని, భారతీయ సినిమాకు ఉన్న అన్ని పరిమితులను చెరిపేశాడని, డైరెక్షన్, టేకింగ్ అద్భుతంగా ఉందన్నారు. ఈ సినిమాతో తెలుగువారందరినీ గర్వపడేలా చేశారని, రానున్న రోజుల్లో మీ చిత్రాలు భారతీయ ముఖః చిత్రాన్ని మారుస్తాయనడంలో సందేహం లేదంటూ’ సినిమాను, సందీప్‌ను పొగడ్తల్లో ముంచేస్తూ ఈ యానిమల్ సినిమా ఇండియన్ క్లాసిక్ చిత్రాల లిస్టులో చేరిందంటూ ఆకాశానికి ఎత్తేశారు.