Alia bhatt : జీవితంలో ఎన్నో సాధించాలంటూ.. ప్రత్యేక శుభాకాంక్షలు!
ABN, First Publish Date - 2023-09-28T16:00:02+05:30
బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir kapoor) పుట్టినరోజు సందర్భంగా ఆయన భార్య అలియాభట్ (alia bhatt) ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. వివాహంతోపాటు పలు సందర్భాల్లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ (Ranbir kapoor) పుట్టినరోజు సందర్భంగా ఆయన భార్య అలియాభట్ (alia bhatt) ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. వివాహంతోపాటు పలు సందర్భాల్లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇందులోని ఓ ఫొటోలో ఆమె రణ్‌బీర్‌ను ముద్దాడుతూ కనిపించారు. ‘‘నా ప్రియుడు.. బెస్ట్ ఫ్రెండ్.. నేను సంతోషంగా ఉండేచోటు.. హ్యాపీ బర్త్‌డే మై బేబీ. నువ్వు మరెన్నో సాధించాలని కోరుకుంటున్నా. నా పక్కనే కూర్చొని నీ సీక్రెట్ అకౌంట్లో నేను పెట్టిన క్యాప్షన్ చదువుతున్న నీకు హ్యాపీ బర్త్‌డే’’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలియా పోస్ట్ చూసి బిపాసా బస్సు, రష్మిక, పీవీ సింధూ, నిధీ అగర్వాల్, దియా మీర్జాతోపాటు పలువురు సినీ ప్రముఖులు రణ్‌బీర్‌కు విషెస్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. కొన్నేళ్లగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇరు కుటుంబాల అంగీకారంతో గతేడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరికి రాహ అనే కుమార్తె ఉంది.