Ramayana: అలియా భట్ తప్పుకుంది, సీతగా మన సౌత్ అమ్మాయే చేస్తోంది అట
ABN, First Publish Date - 2023-07-12T14:49:31+05:30
ఈమధ్య రామాయణం ఆధారంగా ప్రభాస్, కృతి సనన్ జంటగా వచ్చిన 'ఆదిపురుష్' సినిమాని ప్రేక్షకులు చాలా తొందరగా మర్చిపోయారు అలాగే ఆ సినిమా కూడా చాలా విమర్శలకు గురయింది. ఈలోపే నితీష్ తివారి తాను ఇంకో సినిమా రామాయణం ఆధారంగా తీస్తున్నాను అని ప్రకటించాడు. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, అలియా భట్ సీతగా అనుకున్నారు. కానీ అలియా భట్ చెయ్యను అనింది అంటున్నారు. మరెవరు చేస్తారు ఆ పాత్ర అంటే...
బాబోయ్, ఇదేమి రామాయణం అని ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (KritiSanon) జంటగా నటించిన 'ఆదిపురుష్' #Adipurush సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తుంటే ఇంకో సినిమా రామాయణం మీద రాబోతోంది. 'ఆదిపురుష్' ఓం రౌత్ (OmRaut) దర్శకత్వం చేస్తే, అతని చేసిన తప్పులు మేము చెయ్యం అని ఇంకో దర్శకుడు నితీష్ తివారి (Nitesh Tiwari) అంటున్నాడు. ఇతను కూడా చాలా భారీ బడ్జెట్ తో రామాయణం మీద సినిమా తీస్తున్నాను అని ప్రకటించాడు. అయితే ఇతను రామాయణం చదివి అందులో ఎలా ఉందొ అలాగే తీస్తాను అని చెపుతున్నాడు.
ఇంతకీ ఈ నితీష్ తివారీ రామాయణం లో రాముడు ఎవరో తెలుసా, రణబీర్ కపూర్ (RanbirKapoor). అతని పక్కన సీతగా అతని నిజ జీవితంలో భార్య అయిన అలియా భట్ (AliaBhatt) చేస్తోంది అని ప్రకటించారు. అయితే ఇప్పుడు అలియా భట్ సీత పాత్ర నుండి పక్కకి తప్పుకున్నట్టుగా బాలీవుడ్ మీడియా కథనాలు రాస్తోంది. అది ఆమెకి చాలా పెద్ద పాత్ర అని, ఆమె ఎక్కడికి వెళ్లినా సీతా మాత అని అనటం, ఆమె మీద ట్రోల్ చెయ్యడం చాలా జరిగింది.
మరి ఏమయిందో ఏమో కానీ అలియా భట్ మాత్రం సీత పాత్ర నుండి తప్పుకుంది అని మీడియాలో కథనాలు వచ్చేసాయి. ఇప్పుడు ఆమె స్థానంలో ఎవరిని తీసుకుంటున్నారు అని కూడా ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉండగా, అనూహ్యంగా మన దక్షిణాదికి చెందిన అమ్మాయి పేరు బయటకి వచ్చింది. ఇంతకీ ఆమె మరెవరో కాదు మన సాయి పల్లవి (SaiPallavi). మలయాళంలో ఆరంగేట్రం చేసి తరువాత తెలుగులో చాలా సినిమాలు చేసి ఒక సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి సీతమాతగా వేస్తోందని అంటున్నారు.
అయితే సాయి పల్లవి కూడా ఆ పాత్రకి కరెక్టుగా సరిపోతుందని కూడా అంటున్నారు. ఎందుకంటే సాయి పల్లవి ఒక ప్రతిభావంతురాలైన నటి, ఎటువంటి పాత్ర అయినా, బాగా ఆకళింపు చేసుకొని అందులో ఇమిడిపోతుంది. అలాంటిది ఇప్పుడు ఆమె సీత మాతగా అడిగితే తప్పకుండా చేస్తుందని, ఈ సినిమా చాలా పెద్ద బడ్జెట్ తో అన్ని భాషల్లో విడుదల చెయ్యడానికి చూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని కూడా అంటున్నారు.