సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Viral Video: బాలీవుడ్ హీరోను బలవంతంగా కిస్ చేసేందుకు ప్రయత్నించిన అభిమాని!

ABN, First Publish Date - 2023-02-16T16:33:26+05:30

సెలబ్రిటీలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అభిమానులు కూడా సెలబ్రిటీలకు షేక్ హ్యాండ్, హగ్‌లు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. కుదిరితే ఇష్టమైన హీరో, హీరోయిన్‌తో ఫొటో దిగుతుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెలబ్రిటీలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అభిమానులు కూడా సెలబ్రిటీలకు షేక్ హ్యాండ్, హగ్‌లు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. కుదిరితే ఇష్టమైన హీరో, హీరోయిన్‌తో ఫొటో దిగుతుంటారు. తాజాగా ఓ బాలీవుడ్ సెలబ్రిటీకి ఇబ్బందికర అనుభవం ఎదురైంది. మహిళాభిమాని ఒకరు హీరోను బలవంతంగా కిస్ చేసేందుకు ప్రయత్నించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ (Aditya Roy Kapur) తాజాగా నటించిన వెబ్‌సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ (The Night Manager). అనిల్ కపూర్ (Anil Kapoor), శోభిత దూళిపాళ్ల (Shobhita Dhulipala) కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్‌సిరీస్ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’ లో స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 17నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలకు తాజాగా ముంబైలో గ్రాండ్ ప్రీమియర్‌ను ఏర్పాటు చేశారు. ప్రీమియర్ కోసం ఆదిత్య రెడ్ కార్పెట్‌పై నడిచారు. ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా కొంత మంది మహిళాభిమానులు సెల్ఫీలు అడగగా వారితో ఫొటోలు దిగారు. అంత సాఫీగా సాగిపోతున్న దశలో ఓ లేడీ ఆదిత్య దగ్గరకు దూసుకు వచ్చారు. దయ చేసి ఒక కిస్ ఇవ్వండి అని అడిగారు. దీంతో హిరో ఇబ్బందిపడ్డారు. ఆ అభిమాని నుంచి తప్పించుకున్నారు. ఇంతలో ఆ అభిమాని మరోసారి ముద్దు పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఆదిత్య సిగ్గు పడుతూ నవ్వుతూ తప్పించుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో కింది నెటిజన్స్ కామెంట్స్ వర్షం కురిపించారు. ‘‘హీరోను బలవంతంగా కిస్ చేసేందుకు ప్రయత్నించడం వేధింపుల కిందకే వస్తుంది. ఈ విధంగా వేధించడం సరైంది కాదు’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘ఆ అభిమాని క్రేజీగా ప్రవర్తించారు’’ అని మరో నెటిజన్ పోస్ట్ పెట్టారు. ‘ది నైట్ మేనేజర్’ (The Night Manager) మొదట బీబీసీలో డ్రామాగా 2016లో ప్రసారం అయింది. ఈ డ్రామానే హిందీలో అదే టైటిల్‌తో రీమేక్ చేశారు.

Updated Date - 2023-02-16T16:35:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!