సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

The Kerala Story: నెటిజన్‌ కామెంట్‌... అదాశర్మ క్షమాపణ!

ABN, First Publish Date - 2023-06-08T16:51:50+05:30

అదా శర్మ (adah sharma) కీలక పాత్రలో సుదీప్తో సేన్‌ (Sudipto sen) దర్శకత్వంలో వహించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’(The kerala story). ఎన్నో వివాదాల మధ్య గత నెల 5న ఈ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లో సినిమాను నిషేదించడం పట్ల ఓ నెటిజన్‌ పెట్టిన ట్వీట్‌ అదాశర్మ క్షమాపణ చెప్పింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదా శర్మ (adah sharma) కీలక పాత్రలో సుదీప్తో సేన్‌ (Sudipto sen) దర్శకత్వంలో వహించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’(The kerala story). ఎన్నో వివాదాల మధ్య గత నెల 5న ఈ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు నిషేదించిన సంగతి తెలిసిందే! అయినా విడుదల ప్రతి చోట ఈ చిత్రం సూపర్‌ సక్సెస్‌ ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లకు పైగా వసూలు చేసింది. పశ్చిమ బెంగాల్‌లో సినిమాను నిషేదించడం పట్ల ఓ నెటిజన్‌ పెట్టిన ట్వీట్‌ అదాశర్మ క్షమాపణ చెప్పింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. (adah sharma sorry to Netizen)

కోల్‌కతాకు చెందిన ఓ అభిమాని ఈ సినిమా చూడాలనుందంటూ ట్వీట్‌ చేశాడు. ‘‘రూ.500 పెట్టైనా టికెట్‌ కొనుక్కొని ఈ సినిమా చూడాలని ఉంది. కానీ కోల్‌కతాలో ఎక్కడా ఒక్క షో కూడా వేయడం లేదు. ఇక ఓటీటీ మాత్రమే మాకున్న ఏకైక’’ అంటూ ట్వీట్‌ చేశారు. నెటిజన్‌ ట్వీట్‌కు అదాశర్మ స్పందించారు. ‘‘నన్ను క్షమించండి ‘ది కేరళ స్టోరీ’పై నిషేదం ఎత్తేసినా సినిమా ప్రదర్శన మా చేతిలో లేదు’’ అంటూ బాధ పడుతున్న ఎమోజీలను పోస్ట్‌ చేసింది. దీనిపై నెటిజన్లు కూడా కామెంట్‌ చేస్తున్నారు. త్వరగా ఓటీటీలో ఈ సినిమా రిలీజ్‌ చేయాలని కోరుతున్నారు. జీ5 ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. జూన్‌ మూడో వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2023-06-08T16:51:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!