సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Abhishek Bachchan: భార్యకు ప్రశంస.. నెటిజన్‌ సెటైర్‌!

ABN, First Publish Date - 2023-04-30T11:47:28+05:30

మణిరత్నం దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ‘పొన్నియన్‌ సెల్వన్‌ 2’ చిత్రంలో నందినిగా మెప్పించారు మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యరాయ్‌.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మణిరత్నం (Maniratnam) దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ‘పొన్నియన్‌ సెల్వన్‌ 2’ (PS2) చిత్రంలో నందినిగా మెప్పించారు మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యరాయ్‌. ఈ చిత్రంలో తన తన అందంతో, అభినయం, హావభావాలతో ప్రేక్షకుల మదిని దోచుకుంది. పాజిటివ్‌ టాక్‌తో ముందుకెళ్తున్న ఈ చిత్రం గురించి ఐశ్వర్యారాయ్‌ ( AishwaryaRai Bachchan) భర్త అభిషేక్‌ బచ్చన్‌ (Abhishek Bachchan)సినిమా అద్భుతంగా ఉందని సోషల్‌ మీడియాలో రివ్యూ ఇచ్చాడు. ‘పీఎస్‌ 2 సింప్లి ఫెంటాస్టిక్‌’ అని ప్రశంసించారు. మణిరత్నం టీమ్‌ కష్టం తెరపై కళ్లకు కట్టినట్లు కనిపించిందని చెప్పారు.

ఈ మేరకు తన భార్యపై ప్రశంసల వర్షం కురిపించారు. ఐశ్వర్యను చూసి గర్వంగాగా ఉందని, తన పాత్రకు బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చిందని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌కు ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘ఇప్పటికైనా తెలిసిందిగా! నువ్వు ఆరాధ్యను చూసుకో, తనను మరిన్ని సినిమాలకు సైన్‌ చేయనివ్వు’ అని కామెంట్‌ చేశాడు.. దీనికి అభిషేక్‌ స్పందిస్తూ.. ‘‘సర్‌.. తను చేసే పనికి నేను అడ్డు చెప్పను. తనకు నచ్చి చేయాలనుకున్న పనికి నా అనుమతి అవసరం లేదు. అందులోనూ తనకు ఇష్టమైప పని చేస్తానంటే నేను అసలు కాదనను’’ అని రిప్లై ఇచ్చాడు. అభిషేక్‌ సమాధానానికి ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘చాలా బాగా చెప్పారు సర్‌. మీరిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలనుందని ఓ అభిమాని రాసుకొచ్చాడు. (Ponniyin selvan2)

Updated Date - 2023-04-30T11:53:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!