Aishwarya Rai Bachchan: ఐశ్వర్య, అభిషేక్.. ఆ వార్తలన్నీ రూమర్సే! సాక్షాలివిగో
ABN, First Publish Date - 2023-12-17T17:53:09+05:30
ప్రస్తుతం బాలీవుడ్‌లో తరుచుగా వినిపిస్తున్న మాట ఐశ్వర్య, అభిషేక్‌ల విడాకుల గురించే. రెండు మూడు రోజులకోసారి వారు విడాకులు తీసుకున్నారు, తీసుకుంటున్నారంటూ గడిచిన రెండు మూడేండ్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌కు చెక్ పడింది.
ప్రస్తుతం బాలీవుడ్ నోట తరుచుగా వినిపిస్తున్న మాట ఐశ్వర్య (Aishwarya Rai), అభిషేక్‌ల (Abhishek Bachchan) విడాకుల గురించే. రెండు మూడు రోజులకోసారి వారు విడాకులు తీసుకున్నారు, తీసుకుంటున్నారంటూ గడిచిన రెండు మూడేండ్లుగా వార్తలు వస్తున్నాయి. 2007లో ఈ జంట పెళ్లి చేసుకోగా ఆరాధ్యబచ్చన్ అనే 12 సంవత్సరాల కూతురు కూడా ఉన్నది.
అయితే ఈ జంట ఇటీవల కలిసి కనిపించక పోవడం, ఐశ్వర్య(Aishwarya Rai)కు అభిషేక్ (Abhishek Bachchan) ఆలస్యంగా భర్త్‌డే విశెష్ చెప్పడం, అంతా అయిపోయిందంటూ అమితాబ్ ఈ మధ్య ఓ పోస్టు పెట్టడం ఈ విడాకుల వార్తలకు అజ్వం పోసినట్టైంది. ఈ రెండు రోజుల నుంచి ఈ వార్తలు మరీ ఎక్కువ కావడం బీ టౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి.
ఐశ్వర్యకు అత్త జయా బచ్చన్‌తో సరిపడడం లేదని కూతురుతో కలిసి బయటకు వచ్చేసిందన్న వార్తలు అధికం అయ్యాయి. అయితే తాజాగా అబిషేక్, ఐశ్వర్య (Aishwarya Rai) ముంబైలో కూతురు ఆరాధ్య చదువుతున్న అంబానీ స్కూల్ వార్షికోత్సవంలో హడావుడి చేశారు.
వేర్వేరు కార్లలో వచ్చిన ఐశ్వర్య (Aishwarya Rai), అభిషేక్ (Abhishek Bachchan)లు కారు దిగి ఒకరి చేయి పట్టుకుని ఒకరు లోపలికి వెళ్లడం, కుటుంబమంతా కలిసి నృత్యాలు చేయడం, కార్యక్రమం అనంతరం ఈ జంట కలిసి ఒకే కారులో వెళ్లిపోవడం వీరి విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టినట్టైంది.
ఇదిలాఉండగా స్కూల్ వేడుక అనంతరం అమితాబ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టి స్టేజీ షోలో తన మనుమరాలు ఆరాధ్య ప్రదర్శణను మెచ్చుకున్నారు. తన నటన చాలా సహజంగా ఉన్నదని, కార్యక్రమం చూసి మా కుటుంబం అంతా గర్విస్తున్నదంటూ చెప్పుకు వచ్చారు. ఇప్పుడు ఈ పోస్టు నెట్టింట బాగా వైరల్ అవుతున్నది.