సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Upasana Konidela: పుట్టింటిలో సరదాగా...

ABN, First Publish Date - 2022-12-16T14:09:34+05:30

రామ్‌చరణ్‌-ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారంటూ సోమవారం చిరంజీవి శుభవార చెప్పారు. ‘హనుమాన్‌ జీ ఆశీర్వాదాలతో ఈ విషయాన్ని పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామ్‌చరణ్‌(Ramcharan)-ఉపాసన (Upasana)తల్లిదండ్రులు కాబోతున్నారంటూ సోమవారం చిరంజీవి శుభవార చెప్పారు. ‘హనుమాన్‌ జీ ఆశీర్వాదాలతో ఈ విషయాన్ని పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఉపాసన, రామ్‌చరణ్‌లు తల్లిదండ్రులుగా తొలి బిడ్డను ఆహ్వానించబోతున్నారు. ప్రేమతో.. మీ సురేఖ-చిరంజీవి, శోభన-అనిల్‌ కామినేని’ అని పేర్కొన్నారు. చిరంజీవి చెప్పిన శుభవార్తతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామ్‌చరణ్‌ దంపతులకు కంగ్రాట్స్‌ చెబుతున్నారు. (Upasana family time)

ప్రస్తుతం రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన పుట్టింటికి వెళ్లారు. ప్రెగ్నెన్సీని ప్రకటించిన తర్వాత పుట్టింటికి వెళ్లిన ఆమె కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. అయితే తన తన అత్తమ్మ సురేఖను మిస్‌ అవుతున్నట్లు చెప్పారు. ‘‘నా జీవితంలో ఎంతో ముఖ్యమైన మహిళల ఆశీస్సులతో మాతృత్వంలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సమయంలో అత్తమ్మను మిస్‌ అవుతున్నా’’ అని ఉపాసన పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Updated Date - 2022-12-16T14:29:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!