సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Year Ender 2022: ఏడడుగులు వేసిన సెలబ్రిటీలు

ABN, First Publish Date - 2022-12-24T19:35:21+05:30

సినీ ఇండస్ట్రీలో ఈ ఏడాది పెళ్లి భాజాలు బాగానే మోగాయి. అనేక మంది సెలబ్రిటీలు ఏడడుగులు వేశారు. కొత్తగా దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. ఈ జాబితాలో అనేక మంది హీరో, హీరోయిన్స్ ఉన్నారు. హీరోయిన్స్ గతంలో వివాహం చేసుకోగానే సినిమాలకు గుడ్ బై చెప్పేసేవారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ ఇండస్ట్రీలో ఈ ఏడాది పెళ్లి భాజాలు బాగానే మోగాయి. అనేక మంది సెలబ్రిటీలు ఏడడుగులు వేశారు. కొత్తగా దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. ఈ జాబితాలో అనేక మంది హీరో, హీరోయిన్స్ ఉన్నారు. హీరోయిన్స్ గతంలో వివాహం చేసుకోగానే సినిమాలకు గుడ్ బై చెప్పేసేవారు. ప్రస్తుతం కాలం మారింది. అందువల్ల పెళ్లి చేసుకున్నప్పటికి చిత్రాల్లో నటిస్తున్నారు. కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది అతి త్వరలోనే పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో 2021లో పెళ్లి పీటలు ఎక్కిన సెలబ్రిటీలపై ఓ లుక్కేద్దామా..

నయనతార- విఘ్నేశ్ శివన్:

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఈ ఏడాదే పెళ్లి చేసుకుంది. దర్శకుడు విఘ్నేశ్ శివన్(Vignesh Shivan) తో కలసి ఏడడుగులు వేసింది. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో ఈ వివాహం జూన్ 9న ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అతిరథ మహారథులు హాజరయ్యారు. రజినీకాంత్, షారూఖ్ ఖాన్, మణిరత్నం తదితరులు సందడి చేశారు. నయన్ అంతకు ముందు విఘ్నేశ్‌తో కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసింది. ఆలోచనలు, అభిరుచులు కలవడంతో పెళ్లి చేసుకున్నారు. నయన్, విఘ్నేశ్‌ల పెళ్లి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ (Nayanthara Beyond The fairy Tale) టైటిల్‌తో విడుదల కానుంది.

హన్సిక మోత్వానీ- సొహైల్ కతురియా:

హీరోయిన్ హన్సిక మోత్వానీ (Hansika Motwani) ప్రియుడు, వ్యాపార భాగస్వామి సొహైల్ కతురియా (Sohael Kathuriya)ను వివాహమాడింది. జైపూర్‌లోని 450 ఏళ్ల పురాతన రాచకోట ‘ముందోతా ఫోర్ట్‌ ప్యాలెస్‌’ లో డిసెంబర్ 4న ఈ పెళ్లి వైభవంగా జరిగింది. ఈ జంట సింధి సంప్రదాయంలో ఏడడుగులు వేశారు. ఈ వేడుకకు అతిథులు, బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సొహైల్ కతురియాకు గతంలోనే హన్సిక స్నేహితురాలితో వివాహం అయింది. మనస్పర్థాల వల్ల ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు.

ఆలియా భట్- రణ్‌బీర్ కపూర్:

సెలబ్రిటీ లవ్‌బర్డ్స్ ఆలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor)లు ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. అంతకు ముందు ఐదేళ్ల పాటు డేటింగ్ చేశారు. ఈ జంటకు నవంబర్ 6న పండంటి బుజ్జాయి జన్మనిచ్చింది. కూతురికి రాహా (Raha) అని పేరు పెట్టారు. ఆ నామకరణానికి ఉన్న అర్థాలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆనందం, దైవ మార్గం, వంశం, విశ్రాంతి, ఉపశమనం, శాంతి, స్వేచ్ఛ తదితర అర్థాలు రాహాకు ఉన్నట్టు పేర్కొన్నారు.

ఆలీ ఫజల్- రిచా చద్దా:

ఫక్రే (Fukrey) సినిమా సమయంలో ఆలీ ఫజల్ (Ali Fazal), రిచా చద్దా (Richa Chadha) ప్రేమలో పడ్డారు. దాదాపు తొమ్మిదేళ్ల పాటు డేటింగ్ చేశారు. ఈ జంట 2020 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, కరోనా మహమ్మరితో ఈ వేడుక వాయిదా పడింది. చివరగా ఈ ఏడాది అక్టోబర్ 4న ఏడడుగులు వేశారు.

మౌనీరాయ్ -సూరజ్ నంబియార్:

నాగినీ సీరియల్‌తో దేశవ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్న నటి మౌనీరాయ్ (Mouni Roy). ప్రియుడు సూరజ్ నంబియార్ (Suraj Nambiar) ను జనవరి 27న పెళ్లి చేసుకుంది. గోవాలోని హిల్టన్ గోవా రిసార్ట్‌లో బెంగాలీ, దక్షిణాది పద్ధతుల్లో ఈ వివాహం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మందిరా బేడీ, అర్జున్ బిజిలానీ, ఓంకార్ కపూర్ తదితరులు హాజరయ్యారు.

Updated Date - 2022-12-24T21:16:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!