Tamannaah Birthday Special: మిల్కీ బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం
ABN, First Publish Date - 2022-12-21T11:34:41+05:30
దాదాపు 17 ఏళ్ల క్రితం హిందీ చిత్రం ‘ఛాంద్ సా రోషాన్ చహ్ర’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచమైన నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia). కేవలం 15 ఏళ్ల వయస్సులో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ప్రస్తుతం కెరీర్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతోంది.
దాదాపు 17 ఏళ్ల క్రితం హిందీ చిత్రం ‘ఛాంద్ సా రోషాన్ చహ్ర’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచమైన నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia). కేవలం 15 ఏళ్ల వయస్సులో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ప్రస్తుతం కెరీర్లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతోంది. ఈ అందాల భామ నేడు (డిసెంబర్ 21న) పుట్టిన రోజు (Birthday) జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తమన్నాపై ప్రత్యేక కథనం..
హిందీలో చేసిన మొదటి సినిమా ప్లాప్‌గా నిలవడంతో 2005లోనే మంచు మనోజ్ హీరోగా చేసిన ‘శ్రీ’ చిత్రంతో తెలుగు పరిశ్రమకి పరిచయమైంది. 2006లో ‘కేడీ’ సినిమాతో తమిళ ప్రేక్షకులని కూడా పలకరించింది. ఈ రెండు చిత్రాలు కూడా ప్లాప్‌గానే మిగిలాయి. కానీ.. 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన ‘హ్యాపీడేస్’ చిత్రంతో మొదటి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి తమన్నా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇటు తెలుగు సినిమాలు.. అటు తమిళ సినిమాలు.. అడదపాదడపా హిందీ చిత్రాలు చేస్తూ కెరీర్‌ని విజయవంతంగా సాగిస్తోంది.
తమన్నా ఓ వైపు చిరంజీవి, వెంకటేశ్ వంటి సీనియర్ హీరోలతో నటిస్తూనే.. మరో వైపు సందీప్ కీషన్, సత్యదేవ్ వంటి కుర్ర హీరోలతో జతకడుతూ దూసుకుపోతోంది. ఓ వైపు లవ్‌స్టోరీలు చేస్తూనే.. మరో వైపు ‘బాహుబలి’ వంటి సినిమాల్లో వీర నారిగానూ పాత్ర చేసి ఈ బ్యూటీ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించింది. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రవితేజ వంటి స్టార్లకి జోడీగా నటించి మంచి విజయాలను అందుకుంది.