సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sunny leone: అప్పట్లో నన్ను బెదిరించారు

ABN, First Publish Date - 2022-12-26T14:46:58+05:30

పీఎస్‌వీ గరుడవేగ చిత్రంలో ప్రత్యేక గీతంలో అలరించిన సన్నీలియోన్‌ ‘జిన్నా’ చిత్రంలో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే! తాజాగా ఓ తమిళ చిత్రం ప్రచారాల్లో పాల్గొన్న సన్నీ గతంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చి భావోద్వేగానికి లోనయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీఎస్‌వీ గరుడవేగ చిత్రంలో ప్రత్యేక గీతంలో అలరించిన సన్నీలియోన్‌ (Sunny leone)‘జిన్నా’ చిత్రంలో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే! తాజాగా ఓ తమిళ చిత్రం ప్రచారాల్లో పాల్గొన్న సన్నీ గతంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చి భావోద్వేగానికి లోనయ్యారు. సినీరంగంలో అడుగుపెట్టిన కొత్తలో చాలా బెదిరింపులు (Death threats)వచ్చేవనీ, అసలు భారత్‌లో అడుగుపెడతానని అనుకోలేదని ఆమె చెప్పారు. ‘‘కెరీర్‌ బిగినింగ్‌లో ఓ ప్రముఖ టీవీ షోలో కనిపించాను. అప్పుడు నాకు బెదిరింపు మెయిల్స్‌ వచ్చేవి. చంపేస్తామంటూ కొందరు సందేశాలు పంపేవారు. వాటిలో ఎక్కువ భారత్‌ నుంచి వచ్చినవే! దాంతో ఇక్కడి ప్రజలు నాపై కోపంగా ఉన్నారని అర్థమైంది. ఆ బెదిరింపులు నన్ను చాలా ప్రభావితం చేశాయి. అప్పుడు నా వయసు 20 ఏళ్లు ఆ టైమ్‌లో నాకు ఇది మంచి, ఇది చెడు అని ఎవరూ చెప్పలేదు. చెప్పేవారు కూడా నాకు ఎవరూ లేరు. అదే సిచ్చుయేషన్‌ ఇప్పుడు ఎదురైతే నేను అంతగా ఎఫెక్ట్‌ కాను. ఇప్పుడు నేను మానసికంగా బలంగా తయారయ్యా’’ అని అన్నారు. (Tollywood)

Updated Date - 2022-12-26T14:47:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!