సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Anil Ravipudi: బాలయ్య కోసం.. శరత్‌కుమార్‌!

ABN, First Publish Date - 2022-12-17T14:15:00+05:30

నందమూరి బాలకృష్ణ 108వ చిత్రం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి అనిల్‌ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందమూరి బాలకృష్ణ 108(NBK 108)వ చిత్రం అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి అనిల్‌ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. ఇందులో విలక్షణ నటుడు శరత్‌ కుమార్‌ (Sarath kumar in Nbk 108) ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. శరత్‌కుమార్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. ఆయనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉందని, చాలా ఫిట్‌గా, ఫ్యాబులస్‌గా ఉన్నారని రాసుకొచ్చారు. అయితే శరత్‌కుమార్‌ క్యారెక్టర్‌ ఏంటనే విషయాన్ని వెల్లడించలేదు. తండ్రి కూతుళ్ల బంధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇంతకుముందు ఎప్పుడూ చూడని బాలయ్యను చూపిస్తానని, ఆయనలో చూడని కామెడీ కోణాన్ని చూపిస్తానని ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు అనిల్‌. ప్రస్తుతం బాలయ్య వీరసింహా రెడ్డి’ చిత్రంతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రుతీహాసన్‌ కథానాయక.

Updated Date - 2022-12-17T14:15:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!