Dhamaka: చిక్కుల్లో ‘ధమాకా’ చిత్రం.. విడుదల డౌటే!
ABN, First Publish Date - 2022-12-21T19:05:49+05:30
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటించిన ‘ధమాకా’ (Dhamaka) చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన, నటుడు-నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) చేసిన వ్యాఖ్యలపై
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటించిన ‘ధమాకా’ (Dhamaka) చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina), నటుడు-నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సగర (ఉప్పర) సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ మనోభావాలు దెబ్బతీసేవిధంగా కామెంట్లు చేస్తున్నారంటూ హైదరాబాద్ ఫిలించాంబర్ వద్ద తెలంగాణ సగర (ఉప్పర) సామాజికవర్గం నాయకులు ఆందోళన చేపట్టారు. ‘ధమాకా’ చిత్ర ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో ఆ చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన తమ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని, ఇలాంటి వాటిని సహించబోమని తెలంగాణ సగర (ఉప్పర) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర (Uppari Sekhar Sagara) మండిపడ్డారు. నటుడు-నిర్మాత బండ్ల గణేష్ కూడా తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముందు ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా.. లీగల్‌గానూ ప్రొసీడ్ అవుతున్నామని హెచ్చరిస్తూ..దర్శకుడు త్రినాథరావు నక్కిన, బండ్ల గణేష్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాదు.. తమ సామాజికవర్గాన్ని కించపరిస్తే సహించబోమంటూ సగర సంఘం నాయకులు ఫిలించాంబర్ ఎదుట దర్శకుడు త్రినాథరావు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వారు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ‘ధమాకా’ సినిమాను కూడా ఆపేస్తామని హెచ్చరించారు. డిసెంబర్ 23న ‘ధమాకా’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న నేపథ్యంలో.. ఇప్పుడీ సమస్య ఆ సినిమాను చిక్కుల్లో పడేసింది. మరి ఈ సమస్యను ‘ధమాకా’ టీమ్ ఎలా సాల్వ్ చేసుకుంటుందో చూడాల్సి ఉంది.