Prabhas: ఏమీ లేకపోయినా గోల చేస్తున్నారు!
ABN, First Publish Date - 2022-12-30T12:08:07+05:30
‘ఆదిపురుష్’లో ప్రభాస్ సరసన నటిస్తున్న కృతిసనన్‌తో ప్రేమలో ఉన్నట్లు, డేటింగ్ చేస్తునట్లు వస్తోన్న వార్తలపై ప్రభాస్ స్పందించారు. అవన్నీ అవాస్తవాలనీ, మా ఇద్దరి మధ్య ఏమీ లేదనే విషయాన్ని ఆమె ఆమె క్లియర్‌గా చెప్పిందని ప్రభాస్ అన్నారు.
‘ఆదిపురుష్’లో (Adipurush)ప్రభాస్ (Prabhas) సరసన నటిస్తున్న కృతిసనన్(Krithi sanon)తో ప్రేమలో ఉన్నట్లు, డేటింగ్ (love and Dating) చేస్తునట్లు వస్తోన్న వార్తలపై ప్రభాస్ స్పందించారు. అవన్నీ అవాస్తవాలనీ, మా ఇద్దరి మధ్య ఏమీ లేదనే విషయాన్ని ఆమె ఆమె క్లియర్‌గా చెప్పిందని ప్రభాస్ అన్నారు. ఓ హీరోకి హీరోయిన్ మధ్య ఏమీ లేకపోయినా గోల చేస్తున్నారని అన్నారు. ‘ఆహా’ ఓటీటీ అన్‌స్టాపబుల్ 2’ (unstoppble -2)లో హోస్ట్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
‘‘నువ్వు ఎంతోమంది హీరోయిన్స్‌తో స్ర్కీన్ షేర్ చేసుకున్నావు. కానీ, రాముడు సీతతోనే ఎందుకు ప్రేమలో పడ్డాడు?’’ అని షోలో హోస్ట్ అడిగిన ప్రశ్నకు ‘‘అది చాలా పాత వార్త. కేవలం గాసిప్ మాత్రమే అని మేడమ్ చెప్పేసింది. ఏమీ లేకపోయినా అనవసరంగా ఇలా గోల చేస్తున్నారు. అదంతా సోషల్ మీడియా ప్రభావం’’ అని ప్రభాస్ అన్నారు