సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Namrata Shirodkar: ఆ విషయంలోనే మా ఇద్దరి మధ్య గొడవ!

ABN, First Publish Date - 2022-12-17T14:20:06+05:30

మహేశ్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌ తమ వైవాహిక జీవితం గురించి, భర్తతో ఉండే అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తన జీవితంలో సంతోషకరమైన రోజు గురించి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహేశ్‌బాబు(Maheshbabu) భార్య నమ్రతా శిరోద్కర్‌ (Namrata Shirodkar) తమ వైవాహిక జీవితం గురించి, భర్తతో ఉండే అనుబంధం (Persanal life)గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తన జీవితంలో సంతోషకరమైన రోజు గురించి చెప్పారు. మహేశ్‌తో ఏ విషయంలో గొడవ పడేది వెల్లడించారు. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలు పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ‘‘మొదట్లో మోడలింగ్‌ చేశాను. అది బోర్‌ కొట్టడంతో సినిమాల్లోకి వచ్చాను. తెలుగులో ‘వంశీ’ సినిమా చేస్తునప్పుడు మహేశ్‌తో ప్రేమలో పడ్డా. ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. కాబోయే భార్య ఎలా ఉండాలనే విషయంలో మహేశ్‌కు స్పష్టమైన ఆలోచన ఉంది. అందుకే నేను సినిమాలకు దూరమయ్యా. పెళ్లి తర్వాత కూడా నాకు ఆఫర్లు వచ్చాయి. అయితే నాకు సినిమాలు చేసే ఉద్దేశం లేదు. మహేశ్‌కు నాకూ మధ్య గొడవలు రావు. ఒకవేళ ఏమైనా వచ్చినా అది పిల్లల విషయంలోనే! పిల్లలకు ఏం కావాలన్న ఆయన్నే అడుగుతారు. తను కాదు అనరు. నేను కాదంటాను. అలా మా ఇద్దరి మధ్య వాదనలు జరుగుతుంటాయి. మహేశ్‌, నేనూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రోజు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. నా లైఫ్‌లోనే ఎంతో సంతోషకరమైన రోజు అది. పెళ్లి తర్వాత నా ప్రపంచమే మారిపోయింది. మాతృత్వాన్ని పొందడం గొప్ప అనుభూతి’’ అని అన్నారు.

Updated Date - 2022-12-17T22:57:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!