Project K: ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ మేకింగ్ వీడియో
ABN, First Publish Date - 2022-12-31T16:13:20+05:30
కొత్త ఏడాదికి స్వాగతం చెబుతూ ‘ప్రాజెక్ట్ కె’ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో ఆసక్తికరంగా సాగింది. టైర్‌ను రూపొందించడానికి పడిన కష్టాన్ని అందులో చూపించారు. కొంచెం హాస్యాన్ని కూడా మేళవించారు.
‘ఎవడే సుబ్రమణ్యం’, ‘మహానటి’ వంటి వైవిధ్య భరిత చిత్రాలతో ఫేమ్ సంపాదించుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin). ఈ రెండు సినిమాలు విమర్శకుల ప్రశంసలతో పాటు అభిమానుల మెప్పును సంపాదించుకున్నాయి. నాగి ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) తో ఓ సినిమా చేస్తున్నాడు. ‘ప్రాజెక్ట్ కె’ (Project K)ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో మూవీని రూపొందిస్తుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ వైవిధ్య భరితంగా ఉంటుందని నాగ్ అశ్విన్ కొంత కాలంగా చెబుతున్నాడు. అన్నింటిని కొత్తగా క్రియేట్ చేయాల్సి వస్తుందని పేర్కొన్నాడు. తాజాగా ‘ప్రాజెక్ట్ కె’ కు సంబంధించిన మేకింగ్ వీడియోని వైజయంతి మూవీస్ విడుదల చేసింది.
కొత్త ఏడాదికి స్వాగతం చెబుతూ ‘ప్రాజెక్ట్ కె’ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో ఆసక్తికరంగా సాగింది. టైర్‌ను రూపొందించడానికి పడిన కష్టాన్ని అందులో చూపించారు. కొంచెం హాస్యాన్ని కూడా మేళవించారు. స్క్రిఫ్ట్, ప్రొడక్షన్ డిజైన్ పరంగా ‘ప్రాజెక్ట్ కె’ పూర్తి కొత్తగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. వైవిధ్య భరితమైన ప్రపంచాన్ని రూపొందిస్తున్నట్టు సమాచారం. సినిమాను ఏ విధంగా చేయాలో ఆలోచించడానికే సమయం పడుతున్నట్టనిపిస్తుంది. అందువల్లే ‘ప్రాజెక్ట్ కె’ ఆలస్యమవుతున్నట్టు కనిపిస్తుంది. ‘ప్రాజెక్ట్ కె’ పాన్ ఇండియాగా రూపొందుతుంది. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో సినిమా ఉండబోతుందని సమాచారం. ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలకు చోటుంది. ఈ స్టంట్స్‌ను హాలీవుడ్ టెక్నిషీయన్స్ తెరకెక్కిస్తున్నారు. ‘ప్రాజెక్ట్ కె’ ను 2024 ఏప్రిల్‌లో విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.