Mehreen Kaur: ఫిట్‌నెస్ సీక్రెట్స్.. అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్..
ABN, First Publish Date - 2022-12-14T18:05:40+05:30
మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ మెహ్రీన్ కౌర్ (Mehreen Kaur). ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ (Krishna Gaadi Veera Prema Gaadha) తో వెండి తెర పైకి రంగప్రవేశం చేసింది. ‘రాజా ది గ్రేట్’, ‘నోటా’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది.
మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ మెహ్రీన్ కౌర్ (Mehreen Kaur). ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ (Krishna Gaadi Veera Prema Gaadha) తో వెండి తెర పైకి రంగప్రవేశం చేసింది. ‘రాజా ది గ్రేట్’, ‘నోటా’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. ‘ఎఫ్ 2’ లో హనీ రోల్‌లో క్యూట్ గర్ల్‌గా కనిపించింది. తాజాగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. కరోనా అనంతరం షెడ్యూల్ చాలా బిజీగా ఉందని చెప్పింది. ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. నడవడం అంటే చాలా ఇష్టమని పేర్కొంది. లిఫ్ట్ ఎక్కడం కంటే కూడా మెట్లపై నడవడానికే ప్రాధాన్యమిస్తానని వెల్లడించింది. ఓ పెద్ద డైరెక్టర్‌తో సినిమా షూటింగ్‌ను పూర్తి చేశానని తెలిపింది. వచ్చే ఏడాది ప్రారంభంలో అది హాట్‌స్టార్‌లో వస్తుందని స్పష్టం చేసింది. మరికొన్ని ప్రాజెక్టులు కూడా చేతిలో ఉన్నట్టు వెల్లడించింది.